KAIKALA: కైకాల సత్యన్నారాయణ బర్త్‌డే స్పెషల్

70 ల్లో నటులంతా నటసార్వభౌములే. అందులో కైకాల సత్యన్నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నటన అంటే ఆ తరం ...ఎస్వీరంగారావు తర్వాత అంత గొప్ప నటన చేసింది..మనం చూసింది కైకాల గారినే..అసలు యముడు పాత్ర ఆయనకోసమే ..అంత పర్ఫెక్ట్ గా కథ రాసిన రోజులున్నాయి. ఈ రోజు పుట్టినరోజు సంధర్భంగా గుర్తు చేసుకుందాం.


Published Jul 26, 2024 01:10:56 PM
postImages/2024-07-26/1722017444_KAikalasatyanarnay1024x576.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 70 ల్లో నటులంతా నటసార్వభౌములే. అందులో కైకాల సత్యన్నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నటన అంటే ఆ తరం ...ఎస్వీరంగారావు తర్వాత అంత గొప్ప నటన చేసింది..మనం చూసింది కైకాల గారినే..అసలు యముడు పాత్ర ఆయనకోసమే ..అంత పర్ఫెక్ట్ గా కథ రాసిన రోజులున్నాయి. ఈ రోజు పుట్టినరోజు సంధర్భంగా గుర్తు చేసుకుందాం.


కైకాల స‌త్యనారాయ‌ణ‌.. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా ‘భ‌క్తప్రహ్లాద’ విడుద‌ల అయితే.. 1935 జులై 25న స‌త్యనారాయ‌ణ జ‌న్మించారు. 1959లో ఆయ‌న న‌టించిన చిత్రం ‘సిపాయి కూతురు’ విడుద‌ల‌యింది. హీరోగా సినిమా రంగానికి ప‌రిచ‌యం అయినా.. ఆ సినిమా నిరాశ‌ప‌ర్చడంతో విల‌న్‌గా మార‌డానికి త‌ట‌ప‌టాయించ‌లేదు. నటనకు ఆస్కారం ఉన్న ప్రతి సినిమాను చేశారు. విలన్ , మాంత్రికుడు, రోడ్ సైడ్ రోమియో, మంచి తండ్రి , చెడ్డ భర్త, మోసం చేసే కసాయి ఒక్క పాత్ర కూడా చెయ్యలేదని లేదు. నటుడు గా సంపూర్ణంగా బ్రతికేశారు.


కెరీర్ తొలిద‌శ‌లోనే ఆయ‌న‌కి పౌరాణిక పాత్రలు చేసే అవ‌కాశం ల‌భించింది. ‘ల‌వ‌కుశ‌’లో భ‌ర‌తుడిగా.. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో క‌ర్ణుడిగా.. ‘న‌ర్తన‌శాల‌’లో దుశ్శాస‌నుడిగా న‌టించారు. ‘శ్రీకృష్ణపాండ‌వీయం’లో ఘ‌టోత్కచుడి పాత్ర తొలిసారి ధ‌రిస్తే మ‌ళ్ళీ 1995లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ‘ఘ‌టోత్కచుడు’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. నమ్మి వేషం ఇస్తే ప్రాణం పెట్టేవారు సత్యన్నారాయణ.


‘శ్రీకృష్ణావ‌తారం’ చిత్రంలో తొలిసారి దుర్యోధ‌నుడి పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత ‘కురుక్షేత్రం’లో దుర్యోధ‌నుడిగా,  రావ‌ణాసురుడిగా ‘సీతాక‌ళ్యాణం’లో.. భీముడిగా ‘దాన‌ వీర‌ శూర‌ క‌ర్ణ’లో.. మూషికాసురుడిగా ‘శ్రీ వినాయ‌క విజ‌యం’ చిత్రాల్లో నటించి ...మెప్పించి ఈ నాటికి నటుడంటే కైకాల పేరు గుర్తుకువచ్చేలా చేశారు. పాత , కొత్త యముడంటే కైకాల గారే ...2022 డిసెంబరు 23 (వయసు 87 యేళ్ల వయసులో  హైదరాబాదులో తన ఇంట్లో కాలం చేశారు. ఇండస్ట్రీ కి తన మార్కు సినిమాలను వదిలి..తను మాత్రం హుందా గా కన్నుమూశారు. హ్యాపీ బర్త్ డే కైకాల సత్యన్నారయణ గారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news

Related Articles