Kalki:మీ పిల్లలకు కల్కి సెట్ చూపించాలా..ఇదే మంచి ఆఫర్!

ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాన్ వరల్డ్ చిత్రాలలో అద్భుతమైన ఆదరణ పొందింది కల్కి 2898Ad.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో గ్రేట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అలాంటి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అదరహో అనిపించింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-21/1721561043_kalki.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాన్ వరల్డ్ చిత్రాలలో అద్భుతమైన ఆదరణ పొందింది కల్కి 2898Ad.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో గ్రేట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అలాంటి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అదరహో అనిపించింది.

అంతేకాకుండా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తొలిచిత్రంగా కూడా రికార్డు సృష్టించింది.  అలాంటి ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం  ఆనందిస్తున్నారు.  ఈ తరుణంలో  చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.  మీ యొక్క పిల్లలకు కల్కి సెట్స్ ను  చూపించాలని అనుకున్నట్టయితే, మీ యొక్క చిన్నారులు కల్కి సినిమా గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి మాకు పంపించండి. దీంతో మీ పిల్లలకు కల్కి సెట్స్ చూపించే అవకాశాన్ని పొందండి.

https://youtu.be/N57LYP8gtLI?si=WQmtxM83a1_SsXWt

 మీ వీడియోలను #ILoveKalki అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేయండని అంటున్నారు. ఈ విధంగా మీరు చేసినట్లయితే పిల్లలను కలిపి సెట్ చూసే అవకాశం పొందవచ్చు. మరి చూడాలి ఎంతమంది పిల్లలకు ఈ సెట్ చూసే అవకాశం దొరుకుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu nagashwin kalki-movie childrens kalki-set-

Related Articles