Kalki 2898 AD:  కల్కి ఓటిటి ఫిక్స్.. ఎందులో చూడవచ్చంటే..? 2024-06-27 11:13:21

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న మూవీ అనగానే అందరికీ కల్కి 2898 AD మూవీనే గుర్తుకొస్తుంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలవడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీ గురించే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. స్టార్ సెలబ్రిటీల హంగామా మొత్తం ఈ మూవీలో కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువ మంది స్టార్లను నాగ్ అశ్విన్ తీసుకున్నారు.

ఇలా ప్రస్తుతం దేశం మొత్తం కల్కి మేనియానే  నడుస్తోంది. ఇక యుఎస్ లో పడ్డ ప్రీమియర్ షోస్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే చాలా రివ్యూలు కల్కి మూవీకి పాజిటివ్ గా వచ్చాయి. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అని రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలిని మించి ఈ సినిమా ఉండబోతుందని,తెలుగులో రాజమౌళికి దీటుగా నాగ్ అశ్విన్ ఉండబోతున్నారు అంటూ కొంతమంది జనాలు రివ్యూ ఇస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు మిస్ అయితే ఓటీటి లో చూసే సౌకర్యం వచ్చేసింది. దాంతో చాలామంది థియేటర్లోకి వెళ్ళని వారు ఓటీటిలోకి వచ్చేసాక చూసేస్తున్నారు.

ఇక కల్కిమూవీకి సంబంధించి హక్కులను భారీ ధరకు ఓ ఓటిటి పార్ట్నర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని కొనుగోలు చేసిన ఓటిటి వాళ్లు నాలుగు వారాల తర్వాత సినిమాని ఓటీటి లో స్ట్రీమింగ్ చేస్తారు. అయితే ఈ సినిమా హక్కులని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ మీడియా వాళ్ళు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో amazon prime ఓటిటి కనిపిస్తుంది. దీంతోఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఫిక్స్ అయిపోయిందని తెలిసిపోయింది