ఈ మూవీ రికార్డు వసూళ్లతో సత్తా చాటుతోంది. 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టెక్నికల్ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఆరంభం నుంచీ భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ మూవీ రికార్డు వసూళ్లతో సత్తా చాటుతోంది. 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ మూవీలో అమితాబ్ , కమల్ హాసన్ , దిశాపటానీ , దీపికా , ముఖ్యపాత్ర పోషించారు.
'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది. 35వ రోజు తెలుగు కలెక్షన్లు క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ చేసిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి నెల రోజులు దాటినా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం బాగానే లభిస్తోంది.
35 రోజుల్లో తెలుగులో రూ. 185.10 కోట్లు, తమిళంలో రూ. 21.81 కోట్లు, కర్నాటకలో రూ. 36.23 కోట్లు, కేరళలో రూ. 12.92 కోట్లు, హిందీలో రూ. 146.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 129.90 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 532.46 కోట్లు షేర్, రూ. 1108 కోట్లు గ్రాస్ వచ్చింది.