Kalki Movie Temple: కల్కి సినిమా తీసిన శివాలయం ఇదే.. వీడియో ఇదిగో! 2024-06-29 19:10:37

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కల్కీ మూవీ డీటైల్స్ పై జనాలు తెగ వైరల్ అవుతున్నాయి. కల్కీ సినిమాలో ఓ   నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లాపురం గ్రామం సమీపంలో పెన్నా( PENNA RIVER) నది ఒడ్డున ఉంది. పెన్నా నది వరదలకు ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆలయం రెండేళ్ల కిందట బయటపడింది. నెల్లూరు( NELLORE)  జనాలకు అయితే తెలిసిందే.


దాదాపు 300 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలతో ఓ యూట్యూబ్ చానల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ దేవాలయంలో కల్కీ లో కనిపించే శివాలయం ఒకటే .


కల్కి సినిమా లో కనిపించగానే...ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ గుడి.. రీ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే లోకల్ యూట్యూబర్స్ ఈ టెంపుల్ విజిట్ చేసి వీడయో పెట్టారు. ఎప్పుడైతే కల్కీ లో శివాలయం కనిపించిందో. ఈ వీడియోలో చూపించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆలయ గోపురం మాత్రం బయటకు కనిపిస్తోంది. ఇసుకలో కూరుకుపోయిన ఆలయంలోకి వెళ్లేందుకు గ్రామస్థులు చిన్న మార్గం చేశారు. లోపల ఇసుకను తొలగించారు. లోపల శివలింగం స్పష్టంగా కనిపిస్తోంది. లోపలి నుంచి చూస్తే ఆలయ గోపురం చాలా ఎత్తులో ఉంది. బయట శిఖరం నాలుగు వైపులా నందులతో, ఇతర శిల్పాలతో ఉంది. ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో లోపల ఉన్న విగ్రహాలను ఇతర ఆలయాల్లోకి తరలించారని గ్రామస్థులు చెప్పారు. ఆలయంలో బయటపడ్డ శిల్పాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇప్పుడు ఈ శివాలయం ఫుల్ వైరల్ అవుతుంది.