Kalki 2898 AD: కల్కి సక్సెస్ అయితే కుళ్ళుకుంటున్న స్టార్ హీరో.? 2024-06-29 18:44:08

న్యూస్ లైన్ డెస్క్: కల్కి 2898 AD  మూవీ.. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద భారి హిట్ కొట్టింది. ఈ సినిమా చూసి ఎంతోమంది విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు చాలా మంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి ప్రభాస్ యాక్టింగ్ ని, డైరెక్టర్ దర్శకత్వ ప్రతిభని మెచ్చుకుంటున్నారు. కానీ ఆ ఒక్క స్టార్ హీరో మాత్రం కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారట.ఆయన ఈ మూవీ హిట్ అయినందుకు చాలా కుళ్ళుకుంటున్నారట.మరి ఇంతకీ కల్కి మూవీ హిట్ అయినందుకు కుళ్ళుకుంటున్న హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

సినిమా ఇండస్ట్రీలో పోటీ తత్వం అనేది చాలా కామన్. అయితే కొంతమంది నటీనటుల మధ్య విపరీతమైన పగ,ఈర్ష,ద్వేషం వంటివి ఉంటాయి. కొంతమంది అయితే తమకి నచ్చని హీరోల సినిమాలు హిట్ అయితే అస్సలు ఓర్వలేరు.ఆ సినిమాలు ప్లాప్ అవ్వాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా కల్కి 2898 ad మూవీ కూడా సక్సెస్ అవ్వడం ఓ హీరోకి ఆనందాన్ని కలిగించడం లేదట. ఆ హీరో కల్కి సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ తీసుకువచ్చేలా అభిమానులతో చేయించారట.

అంతేకాదు సినిమా ప్లాప్ అవ్వాలని  ఎంతగానో కోరుకున్నారట. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. అలాగే ఎప్పుడయినా సరే న్యాయం,ధర్మం మాత్రమే గెలుస్తూ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉంటాడు అన్నట్లుగా కల్కి మూవీ ఆ హీరో అనుకున్నట్లుగా ఫ్లాప్ అవ్వకుండా హిట్ అయింది. అంతేకాదు ప్రభాస్ వరుస మూవీస్ హిట్ కొడుతుంటే కుళ్ళుకుంటున్నారట. ఇక ఆ మధ్యకాలంలో రాధేశ్యాం,సాహో, ఆది పురుష్ వంటి సినిమాలు ప్లాప్ అయితే ఆ హీరో తెగ పండగ చేసుకుని ఇంట్లో పార్టీ కూడా చేసుకున్నారట. కానీ కల్కి హిట్ అవ్వడం ఆయనకి నచ్చడం లేదట.దాంతో కాస్త కుళ్ళు కుంటున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది