Strange village : ఆ ఊర్లో పిలవాలంటే విజిల్ వెయ్యాల్సిందే ..!!

ఊర్లో  పది ఇరవై మంది కాదు 700 మంది 700 విజిల్స్ ఎలా క్రియేట్ చేశారో వారి క్రియేటివిటీకి మెచ్చుకోవాలి. అసలు ఆ ఊరి కథేంటో తెలుసుకుందాం.


Published Sep 14, 2024 12:34:11 AM
postImages/2024-09-14/1726291982_Screenshot20240914083144.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎవరైనా సరే పిల్లలు పుట్టగానే ఏం పేరు పెట్టాలి...ఆ పేరు వారికి చాలా అందంగా కూడా ఉండాలని ఆలోచిస్తాం కాని అక్కడ ఏ పేరు కాదు ట్యూన్ వెతుకుతారు అర్ధం కాలేదు కదా..అక్కడ ప్రజలకు పేరు కంటే ఈ ట్యూన్ చాలా ముఖ్యం. నిజానికి వారికి పేర్లు ఉన్నా..ట్యూనే చాలా అత్యవసరం. కారణం వారికి ట్యూన్ ను పుట్టిన వెంటనే పెట్టేస్తారు. ఆ ట్యూన్ తోనే పిలుస్తారు. అలా అని ఆ ఊర్లో  పది ఇరవై మంది కాదు 700 మంది 700 విజిల్స్ ఎలా క్రియేట్ చేశారో వారి క్రియేటివిటీకి మెచ్చుకోవాలి. అసలు ఆ ఊరి కథేంటో తెలుసుకుందాం.


మయన్మార్ లోని కాంగ్‌థాన్‌ కొండల మధ్య ఉంటుంది. అందంగా కనువిందు చేస్తుంది.అడవికి వెళ్లిన వాళ్లు ఊరు చేరుకోవడానికి సరైన మార్గం లేదు. దాదాపు 10 కి.మీ. ట్రెక్కింగ్‌ చేయాల్సిందే.  ప్రధాన వృతి వ్యవసాయమే వారి జీవనాధారం అదే.  వారం, పది రోజులకు ఒకసారి మాత్రమే రోడ్డుకు వెళ్లి ఇంటికి కావాల్సినవి తెచ్చుకోవాలి, పొలంలో పండించిన కూరగాయలను అమ్మి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటారు. అడవిలో ఎవరైనా తప్పిపోతే, తమ పేరును గట్టిగా పాటలాగా పాడుతారట. వీరు మనిషి పుట్టగానే ఓ ట్యూన్ ను వాళ్లకు పెడతారు. ఊర్లో ఉన్న 700 మందికి ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన ట్యూన్ ఉంటుంది. అదే వారికి పేరులాగా...కొండకోనల్లో తప్పిపోతే తల్లి ఆ ట్యూన్ ను గట్టిగా పాడుతుంది. ఇలా ఈల శబ్దాలతో పేర్లు పెట్టడాన్ని ‘జిగవా యోబి’ అంటారు. అప్పుడు ఎవరు అడవిలో తప్పిపోయారనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది.


ఇప్పటి వరకు ఈ ఊరి నుండి ఆరుగురంటే ఆరుగురు మాత్రమే ఉన్నత చదువులకోసం ఊరు దాటారు. ఇక్కడ ఈ విజిల్ ఆచారమే టూరిస్ట్ లను తెగ అట్రాక్ట్ చేస్తుంది. విదేశాల నుంచి రీసెర్చ్ ల కోసం స్టూడెంట్స్ కాంగ్ థాన్ కు వస్తుంటారు. వారి జీవన విధానం గురించి అధ్యయనం చేయటానికి.700 మందికి 700 ట్యూన్స్ ను కొత్తగా పెట్టడం మాటలు కాదు. వీటిలో ఎక్కువ శాతం జలపాతాల శబ్దాలు, కోకిల, జంతువులు, పక్షుల శబ్దాలు ఉన్నాయి. మ్యూజిక్ రీసెర్చ్ చేసేవారికి ఈ ఊరు ఓ పెద్ద బుక్ లాగా. అరుదైన శబ్దాలు..అరుదైన ట్యూన్ లు వినిపిస్తయట. భలే ఉంది కదూ.

newsline-whatsapp-channel
Tags : village-people- indian-tourists-in-nepal meghalaya- whistling-village

Related Articles