Kriti Sanon: తనకంటే చిన్న వాడితో పెళ్లికి రెడీ అయిన ప్రభాస్ బ్యూటీ.?

మహేష్ బాబు హీరోగా చేసిన 1 నేనొక్కడినే అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్..అయితే అంతకుముందే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈమె తెలుగులో నటించింది


Published Aug 01, 2024 10:39:16 AM
postImages/2024-08-01/1722526718_prabhas.jpg

న్యూస్ లైన్ డెస్క్: మహేష్ బాబు హీరోగా చేసిన 1 నేనొక్కడినే అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్..అయితే అంతకుముందే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈమె తెలుగులో నటించింది మాత్రం మహేష్ బాబు మూవీనే. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో నాగచైతన్యతో దోచేయ్,ప్రభాస్ తో ఆది పురుష్ వంటి సినిమాలలో నటించింది.

అయితే ఈ సినిమాలేవి కృతి సనన్ కి పేరు తెచ్చి పెట్టలేదు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ సినిమా కూడా డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే. దీంతో కృతి సనన్ కి తెలుగులో అవకాశాలు రావడం లేదు.ప్రస్తుతం బాలీవుడ్ లోనే బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే కృతి సనన్ తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన వ్యక్తితో ప్రేమలో ఉందని,ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ఈ ఏడాదే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతుందనే రూమర్లు జోరందుకున్నాయి.

మరి ఇంతకీ కృతి సనన్ డేటింగ్ చేస్తుంది అంటూ వస్తున్న వ్యక్తి ఎవరో కాదు లండన్ కి చెందిన బిజినెస్ మాన్ కబీర్ బహియా.. అయితే ఈయనకు  స్టార్ క్రికెటర్ అయినటువంటి సచిన్,హార్దిక్ పాండ్యాలతో మంచి అనుబంధం ఉంది.అయితే రీసెంట్ గా కృతి సనన్ తన బర్త్డే వేడుకలని జరుపుకున్న సమయంలో కబీర్ బహియా కూడా కనిపించారు. అలాగే విదేశాల్లో కృతి, కబీర్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక కబీర్ బహియా వయసులో కృతి సనన్ కంటే పదేళ్లు చిన్నవాడు.దాంతో ఈ విషయం తెలిసిన బాలీవుడ్ జనాలు ప్రియాంక చోప్రా లాగే కృతి సనన్ కూడా వయసులో 10 ఏళ్ళు చిన్నవాడైన వ్యక్తిని పెళ్లాడబోతుంది అంటూ ఓ రూమర్ ప్రచారం చేస్తున్నారు. మరి కృతి సనన్ పెళ్ళంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu mahesh-babu adipurush kabir-bahia kriti-sanon

Related Articles