ప్రయాణ సమయంలో మహిళలు ఏదో ఒక పని చేసుకుంటే తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం జరిగిన ఓ మీడియా సమావేశంలో అయన ఈ వ్యాఖ్యలు చేసారు. మనిషికో బస్సు పెట్టండి.. కుట్లు, అల్లికలు అవసరం అయితే డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు కూడా చేసుకుంటరు అని ఆయన అన్నారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సీతక్క.. మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ప్రయాణ సమయంలో మహిళలు ఏదో ఒక పని చేసుకుంటే తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేటీఆర్.. మహిళలకు బేషరుతగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
తాజాగా, ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. 'నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు' అని ఆయన స్పష్టం చేశారు.