పార్లమెంట్ ఎన్నికలకు ముందు గవర్నమెంట్ ఖాతాలోని రూ.187 కోట్లు అక్రమంగా దారిమళ్లినట్లు అసెంబ్లీలోనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మరో నాలుగు రోజుల్లో కాంగ్రెస్ పని ఖతం కానుందని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వాల్మీకీ అంశంపై ఆయన స్పందించారు. ఈ విషయంపై సంచలన నిజాలను బయట పెడుతూ ఓ వీడియో విడుదల చేశారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాం అక్కడి కాంగ్రెస్ నేతలకే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చెమటలు పట్టిస్తోందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు గవర్నమెంట్ ఖాతాలోని రూ.187 కోట్లు అక్రమంగా దారిమళ్లినట్లు అసెంబ్లీలోనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
దీంతో బ్యాంకు అధికారులు సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసిందని కేటీఆర్ తేలిపారు. అయితే, దీనికి సంబంధించిన విషయంలో విచారణ జరుగుతుండగానే వాల్మీకి కార్పొరేషన్ సుపరిడెండెంట్ పద్మనాబ్ ఆత్మహత్య చేసుకున్నారని.. ప్రస్తుతం ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బునే ప్రచారం కోసం వాడుకుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.
V6 బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఖాతాకు రూ. 4.5 కోట్లు తరలించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈడీ, SIT, సీఐడీ సోదాలు అన్నీ జరిగిన తర్వాత కూడా ఈ వార్తలు తెలుగు మీడియాలో ఏ ఒక్క ఛానల్‌లో కూడా ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. సిద్దరామయ్యను తొలగిస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పదవికి కూడా గండం ఉండే అవకాశం ఉందని కర్ణాటక మంత్రి సతీష్ జర్కిహోలి చెప్పారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై దర్యాప్తు జరగకుండా ఎవరు రక్షిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
త్వరలో కాంగ్రెస్ పని ఖతం..?
కర్నాటక వాల్మీకి స్కాంపై KTR సంచలన కామెంట్స్
కర్ణాటకలో తీగ లాగితే.. తెలంగాణ వరకు డొంక కదిలింది-KTR
వాల్మీకి స్కాంలో కాంగ్రెస్ నాయకుల పాత్ర-KTR
V6 బిజినెస్ సొల్యూషన్స్ ఖాతాకు రూ. 4.5 కోట్లు జమ-KTR pic.twitter.com/yo0eKuSQdu — News Line Telugu (@NewsLineTelugu) August 25, 2024