ఓ పోరాటం యావత్ జాతిని నిద్ర లేపిందని ఆయన అన్నారు. ఓ పోరాటం కుల మతాలకు అతీతంగా దేశాన్ని ఏకం చేసిందని తెలిపారు. ఆ పోరాటమే మన బానిస సంకెళ్లను తెంచిందని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: భారతియులుగా స్వాతంత్య్రాన్ని పొందడమే కాదు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాజీ మంత్రి, BRS వర్కప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు. ఓ పోరాటం యావత్ జాతిని నిద్ర లేపిందని ఆయన అన్నారు. ఓ పోరాటం కుల మతాలకు అతీతంగా దేశాన్ని ఏకం చేసిందని తెలిపారు. ఆ పోరాటమే మన బానిస సంకెళ్లను తెంచిందని అన్నారు.
ఎందరో గొప్ప వ్యక్తుల పోరాటం, త్యాగాలు, పట్టుదల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. వారి పోరాటం కారణంగానే మనమంతా స్వపరిపాలనతో ఆత్మగౌరవంగా జీవిస్తున్నామన్నారు. అలుపెరగని పోరాటంతో స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వాన్ని అందించిన మహానీయులను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరముందని అన్నారు.
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్ pic.twitter.com/HK7XF8fLsS — News Line Telugu (@NewsLineTelugu) August 15, 2024