రెండేళ్లు శిక్ష పడేలా కేసులు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు రైతులకు టోపీ పెట్టారని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రుణమాఫీపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకే సయోధ్య లేకుండా పోయిందని ఆయన అన్నారు. వంద శాతం రుణమాఫీ కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పారని గుర్తుచేశారు.
ప్రభుత్వం నడుపుతున్న వారిని రుణమాఫీపై స్పష్టత ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాలేదని రైతులు ఆందోలన చేస్తే.. ఏడేళ్లు. రెండేళ్లు శిక్ష పడేలా కేసులు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
BRS అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడకూడదని రైతులకు పెట్టుబడి సహాయం చేశామని గుర్తుచేశారు. గత పదేళ్లలో రైతుల ఆత్మహత్యలను తగ్గించిన రాష్ట్రం తెలంగాణ మత్రమే అని పార్లమెంట్ లో కూడా చెప్పారని కేటీఆర్ అన్నారు. ఆ స్థాయికి తెలంగాణను తీసుకొని వెళ్లామని అన్నారు.