Laila : లైలా గెటప్ తో విశ్వక్ కు హిట్ పడిందా...లైలా రివ్యూ !

తన తల్లి తర్వాత ఆ పార్లర్ ను విశ్వక్ చూస్తుంటారు. ఓల్డ్ సిటీ ఆడవాళ్లకు మేకప్ చేస్తూ ఫుల్ బిజీ లో ఉంటాడు. అందర్నీ అక్క చెల్లి అంటూ మంచిగా ఉంటాడు


Published Feb 14, 2025 06:31:00 PM
postImages/2025-02-14/1739538125_118233038.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా లైలా ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
కథ లోకి వళ్తే ...విశ్వక్ వాళ్ల అమ్మకు ఓల్డ్ సిటీలో ఓ బ్యూటీ పార్లర్ ఉంటుంది. తన తల్లి తర్వాత ఆ పార్లర్ ను విశ్వక్ చూస్తుంటారు. ఓల్డ్ సిటీ ఆడవాళ్లకు మేకప్ చేస్తూ ఫుల్ బిజీ లో ఉంటాడు. అందర్నీ అక్క చెల్లి అంటూ మంచిగా ఉంటాడు. జిమ్ ట్రైనర్ అయిన జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమలో పడతాడు. SI శంకర్(బబ్లూ పృథ్వీరాజ్) ఇద్దరు భార్యల విషయం ఒకరికొకరికి తెలిసేలా చేసి అతనికి శత్రువు అవుతాడు సోను. రుస్తుం అనే అమ్మాయి పెళ్లికి  విశ్వక్ మేకప్ వేస్తాడు. అయితే పెళ్లి తర్వాత ఆ అమ్మాయి నలుపుగా ఉందని తెలుసుకున్న పెళ్లికొడుకు విశ్వక్ పై పగపెంచుకుంటాడు. తనకు మోసం చేసి ఓ నల్లగా ఉన్న అమ్మాయితో పెళ్లి చేశాడని పగ.


అన్ని వైపులా సోనుపై అటాక్ చేద్దామని ట్రై చేస్తూ సోను బ్యూటీ పార్లర్ పై దాడి చేస్తారు. దీంతో సోనుపై పడ్డ నిందలు అన్ని అబద్దం అని నిరూపించుకోడానికి కొన్నాళ్ళు వీళ్లకు కనపడకుండా ఉండాలని లేడీ గెటప్ వేసి లైలాగా మారతాడు. లైలా గా మారినపుడు వచ్చే సీన్స్ సినిమాకు చాలా ఫన్ క్రియేట్ చేశాయి. సెకండ్ హాఫ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇది కాస్త చిన్నపిల్లలతో కలిసి చూస్తే ..ఇబ్బందిపడడం తప్పదు. ఇక సినిమా అంతా డబల్ మీనింగ్ జోక్స్, అడల్ట్ జోక్స్ తో నవ్వించాలనే ప్రయత్నం చేసారు. కొన్ని చోట్ల లేడీ గెటప్ తో చేసే కామెడీ క్రింజ్ గానే అనిపిస్తుంది. తల్లి ఎమోషన్ మాత్రం కాస్త వర్కౌట్ అయింది.  మొత్తానికి యూత్ కి ఓకే ఓకే ఫ్యామిలీస్ కి కాస్త కష్టమే. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vishwak-sen movie-news review laila

Related Articles