భూమి తన శక్తిని తిరిగి పుంజుకుంటుంది. టైం కి వర్షాలు , పంటలు , అన్ని చక్కగా జరుగుతాయి, కాని ఎంత పండినా జనాలకు మాత్రం అందవట.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : యేడాది మొదలవ్వగానే బాబా వాంగా, వీరబ్రహ్మం గారు చెప్పిన విషయాలన్నీ వైరల్ అవుతుంటాయి. అయితే 2025 కూడా చాలా ముఖ్యమైన విషయాలు తెలిపారు.. ఊహించిన దానికన్నా భయంకరంగా ఉంటుందని ఓ వ్యక్తి ఎప్పుడో జోస్యం చెప్పారు. ఈ ఏడాది విశ్వావసు సంవత్సరం .భూమి తిరిగి తనను తాను ఉత్తేజితం చేసుకుంటుంది. అంటే భూకంపాలు, వరదలు , వర్షాలు , సునామీలు వచ్చి ..భూమి తన శక్తిని తిరిగి పుంజుకుంటుంది. టైం కి వర్షాలు , పంటలు , అన్ని చక్కగా జరుగుతాయి, కాని ఎంత పండినా జనాలకు మాత్రం అందవట.
ఖండాలను మసిచేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయాలు.. ఇలా 2025 మానవ చరిత్రలో సంచలన మార్పులకు కారణమవుతుందట. ఆమె 2025లో గ్రహాంతర వాసులతో మానవుల మధ్య పరిచయం ఏర్పడవచ్చని చెప్పారు. అంతేకాదు 2025 లో టెలిపతి ద్వారా నేరుగా మెదడు నుంచి మాట్లాడుకుంటారు. ఇది నిజానికి చాలా విప్లవాత్మక శాస్త్రీయ ఆవిష్కరణ గా మారుతుంది, నానో టెక్నాలజీలో కూడా పురోగతి ఉంటుంది. నిజానికి బాబా వంగా చెప్పిన జోస్యం కొన్ని సార్లు మాత్రమే నిజమయ్యాయి. కొన్ని నిజం కాలేదు. నిజం అయినట్లయితే భయంకరమైన పరిణామాలు సూచిస్తాయి. ఏవైనా ఈ జోస్యాలు అత్యంత ఆసక్తికరమైన , భయంకరమైన పరిణామాలు సూచిస్తాయి.ఈ జోస్యం కాని నిజమైతే ప్రపంచంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి.