ఈ పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నామన్నారు. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణలో సరస్వతి పుష్కరాలు నిర్వమించేందుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టర్ , వెబ్ సైట్ , మొబైల్ యాప్ ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు జనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్ ,మొబైల్ యాప్ ను ప్రారంభించి పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నామన్నారు. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు.కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి ఏకాశిలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 రోజుల పాటు కాశీ నుంచి వచ్చే పండితులతో ప్రత్యేక మోమాలు ,హారతులు నిర్వహిస్తారు.2013లో తమ హాయంలోనే సరస్వతీ పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాలకు మహారాష్ట్ర తెలంగాణ , ఏపీ , ఛతీస్ గఢ్ నుంచి భక్తులు వస్తూనే ఉంటారు.