Bat Check: బ్యాట్ చెకింగ్ లో దొరికిపోయిన ఇద్దరు కేకేఆర్ ప్లేయర్లు ...వైరల్ వీడియో !

ఈ సీజన్ లో అంపైర్లు ఆట‌గాళ్ల‌ బ్యాట్ల‌ను త‌నిఖీ చేయ‌డం క‌నిపిస్తోంది. బ్యాట్ గేజ్‌తో చెక్ చేస్తుండ‌డం కనిపిస్తుంది.


Published Apr 16, 2025 04:23:00 PM
postImages/2025-04-16/1744800869_sunilnarine11744798332.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఐపీఎల్ 18 వసీజన్ చాలా ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది.టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్స్ గా భావించిన జట్లు అనూహ్యంగా తడబడుతుంటే అసలు మాత్రం అంచనాలు లేని జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో అంపైర్లు ఆట‌గాళ్ల‌ బ్యాట్ల‌ను త‌నిఖీ చేయ‌డం క‌నిపిస్తోంది. బ్యాట్ గేజ్‌తో చెక్ చేస్తుండ‌డం కనిపిస్తుంది.


ఈ బ్యాట్ చెకింగ్ రూల్ పాతదే అయినా ఇలా ప్రేక్షకులకు కనిపించేలా చేయడం ఫస్ట్ టైం కాదు ఇప్పటి వరకు మ్యాచ్ కు ముందు లేదా డ్రెస్సింగ్ రూమ్స్ లో బ్యాట్ల తనిఖీలు జరిగేవి. ఇప్పుడు మ్యాచ్ మధ్యలో చెక్ చేస్తున్నారు. బ్యాట్ మొత్తం పొడవునా గేజ్ ని తసుకువెళ్తున్నారని ఆ టైంలో కొలతలు దాటలేదని నిర్ధారించుకున్నాక బ్యాట్ ను తీసుకువెల్లనిస్తున్నారు.


మంగళవారం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ప్లేయ‌ర్ సునీల్ న‌రైన్ బ్యాట్ ఈ చెక్‌లో విఫల‌మైంది. నరైన్ బ్యాటింగ్ చేయ‌డానికి సిద్ధమవుతున్నప్పుడు అతని బ్యాట్‌ను తనిఖీ చేయ‌గా, అది ఆమోదయోగ్యమైన పరిమితిని ఉల్లంఘించినట్లు తేలింది. అన్రిచ్ నోకియా , బ్యాటింగ్ చేయడానికి బయలుదేరే ముందు అతని బ్యాటన్ ను తనిఖీ చేశారు. ఆటలో బ్యాటర్ల అధిక్యాన్ని నిరోధించడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిట్ ఆటల టైంలో సడన్ బ్యాట్ చెకింగ్స్ ను ప్రవేశపెట్టింది.అయితే, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) vs ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ) మ్యాచ్‌లలో బౌండ్రీ రోప్ వెలుపల మైదానంలో తనిఖీలు జర‌గ‌డం గ‌మ‌నార్హం. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu cricket-player

Related Articles