KTR: దళిత మహిళపై ఇంత దాష్టీకమా?

ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ఉసురు పోసుకోవడం ఈ ఆడబిడ్డలకు మంచిది కాదని హెచ్చరించారు. 


Published Aug 05, 2024 12:12:15 AM
postImages/2024-08-05/1722834698_kttr.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఓ దళిత మహిళపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో సునీత అనే దళిత మహిళపై పోలీసులు క్రూర చర్యకు పాల్పడ్డారు. తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని ప్రశ్నిసినారు. 

రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి వచ్చిందని, ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు.. మరోవైపు దాడులు, దాష్టీకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ఉసురు పోసుకోవడం ఈ ఆడబిడ్డలకు మంచిది కాదని హెచ్చరించారు. 

ఆడబిడ్డలను గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ, యి రకంగా అవమానించొద్దని ఆయన సూచించారు. ళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరును BRS ఖండిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈ దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత మహిళలకు న్యాయం చేయాలని సూచించారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ  క్షమించదని కేటీఆర్ తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : ts-news revanth-reddy news-line newslinetelugu telanganam police congress-government lathicharge dalitwoman shadnagarps

Related Articles