బింబిసార-విశ్వంభరకి లింక్..ప్రూఫ్ ఇదేనా.?

బింబిసార-విశ్వంభర మూవీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. వశిష్ట దర్శకత్వం వహించినటు వంటి  బింబిసార మూవీకి మరియు విశ్వంభర చిత్రానికి లింకు ఉందని  కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు సోషియో ఫాంటసీ జానర్ లో వస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు చిత్రాలకి వశిష్ఠనే డైరెక్టర్.  ఈ రెండు మూవీస్ ఒకే సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని వార్తలు వస్తున్నాయి. వశిష్ట బింబిసార విశ్వంభర కనెక్ట్ చేసి ఒక యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  ఈ పోస్టులకు ప్రధాన కారణం వశిష్ట ట్విట్టర్ కవర్ పేజీ పై ఓవైపు విశ్వంభర మరోవైపు బింబిసార చిత్రాలకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఈ రెండు ఒకే యూనివర్స్ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Published Jul 11, 2024 10:15:00 AM
postImages/2024-07-11/1720671149_chiru.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యంత సూపర్ హిట్ అయినటువంటి మూవీ బింబిసార. ఈ చిత్రానికి ముందు ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. కానీ కొన్ని ఫ్లాప్స్ మరి కొన్ని హిట్ అయ్యాయి. ఇక కళ్యాణ్ రామ్ కెరియర్ ముగిసింది అనే సమయానికి బింబిసారతో వచ్చి మంచి హిట్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వశిష్ట దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాని కూడా చేస్తున్నారు. ఈ చిత్రం కూడా సోషియో ఫాంటసీ జానర్ లో వస్తుంది. అయితే చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత  చేస్తున్నటువంటి సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరే. ఈ మధ్యలో ఆయన దగ్గరికి ఎన్నో సోషియో ఫాంటసీ కథలు వచ్చాయట. కానీ కథలు నచ్చక ఆయన రిజెక్ట్ చేశారట. కానీ వశిష్ట చెప్పిన కథ ఎంతో నచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. వశిష్ట దర్శకత్వం వహించినటు వంటి  బింబిసార మూవీకి మరియు విశ్వంభర చిత్రానికి లింకు ఉందని  కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు సోషియో ఫాంటసీ జానర్ లో వస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు చిత్రాలకి వశిష్ఠనే డైరెక్టర్.  ఈ రెండు మూవీస్ ఒకే సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే సినిమాటిక్ యూనివర్స్ కి మంచి డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కూడా మొదలైంది. తాజాగా నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు. దీంతో వశిష్ట కూడా బింబిసార విశ్వంభర కనెక్ట్ చేసి ఒక యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  ఈ పోస్టులకు ప్రధాన కారణం వశిష్ట ట్విట్టర్ కవర్ పేజీ పై ఓవైపు విశ్వంభర మరోవైపు బింబిసార చిత్రాలకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఈ రెండు ఒకే యూనివర్స్ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/SivaHarsha_23/status/1810710498377343170?s=19

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu kalyan-ram vishvambhara bimbisara vasista

Related Articles