తెలంగాణలో దోచేస్తూ కాంగ్రెస్ పెద్దలకు చేరవేస్తూ..రేవంత్ పనులు మామూలుగా లేవే.?

కాంగ్రెస్ పార్టీలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ పార్టీకి వెన్నెముకలా ఉంటారని పార్టీ నేతలు చెబుతుంటారు..పార్టీకి కావాల్సిన అవసరాలన్ని తీరుస్తూ ఉంటారనేది


Published Sep 21, 2024 11:10:00 AM
postImages/2024-09-21/1726896047_revanth.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ పార్టీకి వెన్నెముకలా ఉంటారని పార్టీ నేతలు చెబుతుంటారు..పార్టీకి కావాల్సిన అవసరాలన్ని తీరుస్తూ ఉంటారనేది ఓపెన్ సీక్రెట్. ఆయన లేకుండా కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు లేదని అంటుంటారు. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆర్థికంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారనే ప్రచారం ఉంది. ఇప్పుడు మరోసారి ఆయన సేవలు పార్టీకి భారీగా అవసరం అవుతున్నాయట. నాలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. పార్టీ పెద్దలు భారమంతా ఆయనమీదే పెట్టారని తెలుస్తోంది.  నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు కావాల్సిన తైలం సమకూర్చాలని డీకే శివకుమార్ పార్టీ పెద్దలు ఆదేశాలిచ్చారట.

అక్కడే వ్యవహారం తేడా కొట్టిందని తెలుస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్న డీకే.. ఇదే అవకాశంగా అధిష్టానానికి ఝలక్ ఇచ్చారట. సీఎం సీటు ఇస్తేనే కాసులు బయకు తీస్తానని తెగేసి చెప్పారట. అన్నింటిలో ముందుండి చూసుకున్నా.. వందలకోట్లు ఖర్చు పెట్టుకున్నా.. జైలుకు కూడా వెళ్లొచ్చా.. అయినా నేను కోరుకున్నది మాత్రం మీరు ఇవ్వడం లేదని అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట.  డీకే శివకుమార్ ఎంత సీరియస్ అయినా కానీ పార్టీ పెద్దలు నోరు మెదపలేదట. సిద్దరామయ్యను కదిపే పరిస్థితి లేదు. ఆయన్ను ముట్టుకుంటే ప్రభుత్వమే కూలిపోయే ఛాన్స్ ఉంది.

దీంతో ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్టుగా మారిందట హస్తం పెద్దల పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియక డీకేకు స్వారీ చెప్పారట. దీంతో ఈయన కూడా స్వారీ చెప్పేశారట. సరుకు నేను సర్దలేను.. వేరే దాతను చూసుకోండని చేతులెత్తేశారట. అయితే మరో అసలు కథ ఇక్కడే మొదలైందనే చర్చ అటు ఢిల్లీలో.. ఇటు కర్నాటకలో జోరుగా నడుస్తోంది.  దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే మూడు రాష్ట్రాల్లో. హిమాచల్ ప్రదేశ్ ఆర్థికంగా అంపశయ్యమీద ఉంది. వాళ్లు పైసా తీసే పరిస్థితి లేదు. ఇక మిగిలింది తెలంగాణ.

అయితే.. ఇక్కడ కూడా త్వరలో సీఎంను మార్చబోతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీంతో మరో మార్గం లేక.. డీకే శివకుమార్ బాధ్యతలు తాను తీసుకుంటానని పార్టీ పెద్దలకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికలకు కావాల్సిన తైలమంతా తాను సర్దేస్తానని.. ఎన్ని బ్యాగులు కావాలంటే.. అన్ని బ్యాగులు పంపిస్తానని హామీ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసమే హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ట్యాక్స్ అంటూ అప్పట్లోనే బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు రాష్ట్రంలో వ్యవహారం నడుస్తోందట.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల దగ్గర్నుంచి భారీగా ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారట. గతంలో ఒక్కో SFTకి వంద రూపాయల కమిషన్ వసూలు చేసేవారట. కానీ ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఖర్చు భారం మీద పడటంతో దాన్ని 175 రూపాయలకు పెంచారనే మాట రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ట్యాక్స్ కట్టిన వాళ్లను హైడ్రా పేరుతో, ఇతరత్రా అనుమతుల పేరుతో వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరోపించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మరిన్ని రాష్ట్రాల ఎన్నికలు రావడంతో.. ఆ ట్యాక్సులు మరింతగా పెరిగాయనే చర్చ జరుగుతోంది. ఇక్కడ ముక్కుపిండి వసూలు చేసి వాటిని ఢిల్లీ విమానమెక్కిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలి రాబర్ట్ వాద్రా పర్యటనపైనా ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : india-people news-line cm-revanth-reddy congress-government hydra karnataka-congress

Related Articles