తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటులు అంటే చాలామందికి గుర్తుకొచ్చి సీనియర్ ఎన్టీఆర్ మరియు మహానటి సావిత్రి మాత్రమే. ఇందులో ఎన్టీఆర్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ గా మాత్రం ఎన్టీఆర్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది సావిత్రి. మహానటిగా బిరుదు ఇచ్చారు. అలాంటి సావిత్రి కేవలం కళ్లతోనే ఎన్నో హావా భావాలు పలికించెదట. అప్పట్లో సావిత్రి హీరోయిన్ గా వస్తుంది అంటే, సినిమా థియేటర్లలో కొన్ని నెలల పాటు రద్దీ కొనసాగేదట.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటులు అంటే చాలామందికి గుర్తుకొచ్చి సీనియర్ ఎన్టీఆర్ మరియు మహానటి సావిత్రి మాత్రమే. ఇందులో ఎన్టీఆర్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ గా మాత్రం ఎన్టీఆర్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది సావిత్రి. మహానటిగా బిరుదు ఇచ్చారు. అలాంటి సావిత్రి కేవలం కళ్లతోనే ఎన్నో హావా భావాలు పలికించెదట. అప్పట్లో సావిత్రి హీరోయిన్ గా వస్తుంది అంటే, సినిమా థియేటర్లలో కొన్ని నెలల పాటు రద్దీ కొనసాగేదట.
ఆ విధంగా అప్పటి హీరోలతో సమానంగా పోటీ పడినటువంటి సావిత్రి హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ ఇలా ఎన్నో భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లోనే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టింది. కానీ చివరికి అనాధగా మరణించింది. అలాంటి సావిత్రికి దయాగుణం ఎక్కువ. తాను సంపాదించిన ఆస్తుల్లో చాలావరకు తన బంధుమిత్రులకు, స్నేహితులకు, ఆపదపై తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి తన దగ్గర ఉన్నదంతా పెట్టింది. ఇలా సావిత్రి గురించి చెప్పాలంటే ఈ ఆర్టికల్ సరిపోదు.
అలాంటి మహానటి సావిత్రి ఒక టైం లో అప్పటి ఏపీ సీఎం పీవీ నరసింహారావు, అప్పటి సీనియర్ నటుడు అయినటువంటి ఎంజీఆర్ తో పోటీపడి ఒక వేలం పాటలో గెలిచిందట. ఆ వేలం పాట ఎందుకు పాడింది అని వివరాలు చూద్దాం. సావిత్రికి దయా గుణం ఎక్కువ. ఎవరైనా సరే ఆపదని వస్తే తప్పకుండా ఆదుకునేది. ఆ రోజుల్లోనే ఆమె ఇంటి ఖర్చు నెలకు 50 వేల రూపాయలు అయ్యేది. అంటే ఇప్పుడు నెలకు ఖర్చుతో పోలిస్తే ఐదు కోట్ల తో సమానం అవుతుంది.
ఇది 1972 లోని మాట. పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులవి. దేశ రక్షణ నిధి కోసం భారీగా విరాళాలు ఇవ్వాలని ఆయన ఒక మీటింగులో అనౌన్స్ చేశారు. వెంటనే ఏఎల్ శ్రీనివాసం పివికి మెడలో వేసినటువంటి దండను అప్పుడే వేలం వేశారు. ఆ వేలంలో సావిత్రి ఎంజీఆర్ ఇతర స్టార్ నటులందరూ పాల్గొన్నారు. కానీ సావిత్రి మాత్రం ఆ దండను అప్పట్లోనే 32 వేల రూపాయలు ఇచ్చి కొన్నది. ఈ వేలంలో ఎంజీఆర్ ఇతర పెద్దపెద్ద నటులు కూడా ఉన్నారు వారందరికంటే వేలంలో ఎక్కువ పాట పాడి గెలుచుకున్నారు. దీంతో సంతోషించిన పీవీ నరసింహారావు ఆ దండను సావిత్రి మెడలోనే వేశారు. అలా వేలం పాట పాడిన డబ్బు అంతా దేశ రక్షణ కోసం, విపత్తుల కోసం ఇచ్చేశారు.