2014 లో సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ చెయ్యడానికి మెజారిటీ కోసం మిత్రపక్షాలపై కాషాయ పార్టీ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సరిగ్గా ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మహారాష్ట్రో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కి ఊహించని పరాభవం ఎదురైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 28 ఎంపీ సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీ ఈసారి కేవలం 13 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ ఎంపీ స్థానాలున్న మహారాష్ట్రలో ఎదురుగాలి వీచింది. ఒకానొక టైంలో 2014 లో సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ చెయ్యడానికి మెజారిటీ కోసం మిత్రపక్షాలపై కాషాయ పార్టీ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాని ఈ సారి మాత్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని రీతిలో సత్తా చాటింది బీజేపీ . అన్ని స్థానాల్లో పోటీ చేయకపోయినా సింగిల్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా 149 సీట్లు గెలుచుకుంది. పార్టీ వేసిన ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఫలించాయి. బీజేపీ నాయకత్వం 100 శాతం సఫలమైంది.
ఇక పార్టీ, మహాయుతి కూటమిలో తిరుగుబాటు, అసంతృప్తి నేతలను బీజేపీ విజయవంతంగా శాంతింపజేసింది. ఎన్‌డీఏప్రభుత్వం చాలా పెద్ద ప్లాన్ చేసి ది బెస్టి క్యాండిడేట్స్ ను నిలబెట్టింది. అయినా వర్కవుట్ కాలేదు. మహిళల ఓట్లు కొల్లగొట్టిన లడ్కీ బెహెన్ స్కీమ్ మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి ‘లడ్కీ బెహెన్’ పథకం ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.1,500 నగదు బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకి వస్తే రూ.2,100కి పెంచుతామని హామీ ఇచ్చింది.
దీంతో మహిళా ఓటర్లు ఆకర్షితులయ్యారు. ఓబీసీ కులాల ఏకీకరణ కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు కూడా సానుకూలంగా మారాయి. రిజర్వేషన్లను తొలగించేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ బూటకపు వాగ్దానం చేసిందని ఓబీసీ వర్గాలను నమ్మించడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పర్ఫెక్ట్ గా రైతులను గుర్తుంచుకుంది. రైతు రుణ మాఫీ తో ప్రజలు బీజేపీ కి క్లీన్ చిట్ ఇచ్చేశారు. మహారాష్ట్ర లో ఉల్లి రైతులు , పత్తి , సోయాబీన్ , రైతులే ముఖ్యంగా బీజేపీ గెలుపుకు కారణం.