వినేష్ తో నేను మాట్లాడతానంటు చెప్తున్నారు మహవీర్ ఫొగాట్. తాను మళ్లీ బౌట్‌లో దిగబోనని స్పష్టం చేసింది. దీనిపై ఆమె చిన్ననాటి కోచ్, ఆమె పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ స్పందించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్ లో అనర్హత వేటు గురయ్యింది ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫొగాట్. 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నకారణంగా అనర్హత వేటు వేశారు. అయితే ఆ బాధ లో వినేశ్ ఈ రోజు ఉదయం 5 గంటలకు తన రిటైర్మెంట్ ను ప్రకటించింది. 29 యేళ్లలోనే రిటైర్మెంట్ పై భారత్ పెద్దలు , జనాలు షాక్ అయ్యారు. ఎంతో మంది నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
లేదు వినేష్ తో నేను మాట్లాడతానంటు చెప్తున్నారు మహవీర్ ఫొగాట్. తాను మళ్లీ బౌట్‌లో దిగబోనని స్పష్టం చేసింది. దీనిపై ఆమె చిన్ననాటి కోచ్, ఆమె పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ స్పందించారు. తాను.. వినేష్‌తో మాట్లాడతాననీ.. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేసుకోవాలని కోరతానని చెప్పుకొచ్చారు.
అధిక బరువు కారణంగా పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 100 గ్రాముల బరువు కోసం అనర్హత వేసింది. మొదటిసారి 2016 లో ఒలంపిక్స్ కు తను గాయం కారణంగా దూరంగా ఉండాల్సి వచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడి నిష్క్రమించింది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీలో ఫ్రీస్టైల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరింది.
రౌండ్-16లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌కు చెందిన యుయిని 3-2ను ఓడించింది. క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను 7-5తో ఓడించింది. సెమీఫైనల్ అయితే ఏకంగా 5-0 తేడాతో క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్‌ను చిత్తు చేసింది. బంగారు పతకానికి అడుగు దూరంలో ఉండగా వెయిట్ ఇష్యూతో బయటకు రావాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను వినేష్ ఆశ్రయించింది. ఈ పిటిషన్ తీర్పు వచ్చినా అది ఫొగాట్ కు అనుకూలంగా వస్తుందనే నమ్మకం లేదంటున్నారు స్పోర్ట్స్ ఎనలిస్ట్ లు .