Kotla Mahipal: దమ్ముంటే ఐటీ కంపెనీ పెట్టి చూపించండి

 నిరసన వ్యక్తం చేసిన తరువాత పోలేపల్లి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను తమ స్వార్థం కోసం రాజకీయా లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారని మహిపాల్ తెలిపారు. 
 


Published Aug 15, 2024 02:59:56 PM
postImages/2024-08-15/1723714196_mudiraj.jpg

న్యూస్ లైన్ డెస్క్: కొడంగల్ నియోజకవర్గంలో నిర్మించనున్న ఫార్మా కంపెనీ వద్దని ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాని కోసం తమ భూములను కూడా సర్కార్ తీసుకోనుందని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీ వస్తే విషపు గాలులు వస్తాయని, ప్రజల ఆరోగ్యం పదవుతుందని వాపోయారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటుంది. 

దీంతో ఈ అంశంపై దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ కూడా స్పందించారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని హక్కింపేట లగచర్ల పోలేపల్లి గ్రామంలో ఫార్మా కంపెనీని నిర్మించవద్దని రైతులు ఆందోళన చేపట్టారని ఆయన తెలిపారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిరసన వ్యక్తం చేసిన తరువాత పోలేపల్లి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను తమ స్వార్థం కోసం రాజకీయా లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారని మహిపాల్ తెలిపారు.

ఫార్మా కంపెనీ కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి 3 వేల ఎకరాల భూమిని తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీ వద్దనిఆందోళనలు చేస్తున్న రైతులు సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి గ్రామానికి చెందిన చిడపురుగు అయిన పోలేపల్లి నరసింహ ఇంటిని ముట్టడించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. నరసింహా పరిసర ప్రాంతాలను నాశనం చేసే ఈ ఫార్మా కంపెనీ బదులు ఐటి హబ్ లేదా ఐటి కంపెనీ తీసుకురావాలని రేవంత్ రెడ్డికి నరసింహ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులను తిడితే ఫేమస్ అవుతామని భావిస్తున్న వైఖరిని నరసింహ మానుకోవాలని ఆయన సూచించారు.  

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam cm-revanth-reddy kotla-mahipal-mudiraj

Related Articles