SPORTS: ఈ సారి మ్యాక్స్ వెల్ దులిపేశాడు ...ఏం ఆట భయ్యా

వాషింగ్టన్ ఫ్రీడం ఫైనల్ కు చేరింది. ఈ రోజు జరిగిన క్వాలిఫయర్ లో మేజర్ లీగ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పై 7 వికెట్ల డిఫరెన్స్ తో విజయం సాధించింది.


Published Jul 26, 2024 06:16:05 AM
postImages/2024-07-26/1721991036_l1820231108094058.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  వాషింగ్టన్ ఫ్రీడం ఫైనల్ కు చేరింది. ఈ రోజు జరిగిన క్వాలిఫయర్ లో మేజర్ లీగ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పై 7 వికెట్ల డిఫరెన్స్ తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ రచిన్ రవీంద్ర , మార్నో జన్సెన్ , నేత్రావల్కర్ , ఫెర్గూసన్ సూపర్ గేమ్ ప్లే చేశారు. బ్యాటింగ్ రేంజ్ కి 19 ఓవర్లలో 145 స్కోర్ కి ఆల్ ఔట్ అయ్యింది. యూనికార్న్స్ ఈ ఇన్సింగ్స్ లో ఇరగదీశారు . హసన్ ఖాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.


145 టార్గెట్ తో వాషింగ్టన్ ట్రవిస్ హెడ్ , గ్లెన్ మ్యాక్స్ వెల్ బరిలోకి దిగి ..23 బంతులకు 54 రన్స్ కొట్టి నాటౌట్..రచిన్ రవీంద్ర అయితే జస్ట్ 3 రన్లకు పెవిలియన్ కు చేరుకున్నారు, మ్యాక్స్ వెల్ ఈ గేమ్ లో దుమ్ము దులిపేశాడు. అసలు ఎంత ఈజీ గా ఆటను ముగించేశారు. యూనికార్న్ బౌలర్స్ లో హసన్ ఖాన్ , పాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ నేరుగా ఫైనల్స్ కు చేరుకుంది. యూనికార్న్స్ మాత్రం రేపు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో వారు జూలై 29 న జరిగే ఫైనల్ మ్యాచ్ లో వాష్టింగ్టన్ ఫ్రీడం తో అమీతుమీ తేల్చుకుంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cricket-news

Related Articles