శరీరతత్వం అనుకుంటాం ..కాని సరైన మెటబాలిజం లేక ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కొన్ని మూలికలు ఈ మెటబాలిజాన్ని పెంచుతాయి. ఇది పెరిగితే ఆటోమెటిక్ గా బరువు కంట్రోల్ చేస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది చాలా డైట్ చేస్తారు . చాలా బాగా వర్కౌట్ చేస్తారు. కాని బరువు కంట్రోల్ లో ఉండరు. శరీరతత్వం అనుకుంటాం ..కాని సరైన మెటబాలిజం లేక ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కొన్ని మూలికలు ఈ మెటబాలిజాన్ని పెంచుతాయి. ఇది పెరిగితే ఆటోమెటిక్ గా బరువు కంట్రోల్ చేస్తుంది. అది కూడా అందుబాటులో ఉండేవే.. జస్ట్ మనం తిని ట్రై చేస్తే తెలుస్తుంది.
కిచెన్ దొరికే మసాలా పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టం నుండి రక్షిస్తాయి. దీంతో పాటు బరువు తగ్గడానికి, హెల్దీ వెయిట్ మెంటెయిన్‌కి చాలా బాగాహెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వంటల రుచిని, వాసనని పెంచుతాయి.
* ఇలాచీ
యాలకుల్లో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజ్ పెరిగి కొలెస్ట్రాల్ కరుగుతుంది. దీని వల్ల జీర్ణశక్తి కూడా పెరిగి మనం ఏ ఫుడ్ తీసుకున్నా...మెల్లగా అరుగుతుంది. దీని వల్ల మీ పొట్టలో ఫుడ్ ఎక్కువ సేపు ఫిల్లింగ్ గా ఉంటుంది.
* టీ , కాఫీ
నిజానికి అన్ని సార్లు టీ , కాఫీ చెడు చెయ్యవు..ఎక్కువ కాఫీ , టీ తాగే వాళ్లు సరిగ్గా ఫుడ్ తీసుకోరు. దీని కారణం సరైన మెటబాలిజం ..అతిగా కాకుండా ...తగిన మోతాదులో తీసుకుంటే చాలా మంచిది
* ఆకుకూరలు
ఆకుకూరలు తిన్నా...కూడా చాలా ఆరోగ్యం గా ఉండడమే కాదు. విటమిన్ A తో పాటు మెటబాలిజం ను మెరుగుపరుస్తుంది. లేడీస్ ను ఎనీమియా నుంచి కాపాడతాయి కూడా
* అల్లం
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పొట్టలో యాసిడ్స్ తక్కువ ఫామ్ అవుతాయి. దీని వల్ల ఎంత సేపు ఆకలి తో ఉన్నా గ్యాస్ ఫామ్ అవ్వదు. ఇది మీకు బరువును చాలా ఫాస్ట్ గా తగ్గిస్తుంది.
* ఫైబర్ ఫుడ్
ఫైబర్ ఫుడ్ ఏం తిన్నా..కార్న్ ..లాంటివి తింటే పొట్టలో చెత్త ఎక్కువగా ఉంటుంది. అదే పీచు పదార్ధం . దీని వల్ల చాలా స్లో గా అరుగుతుంది. ఎక్కువ సేపు కొత్త ఫుడ్ ను తీసుకోకుండా ఆపుతుంది. బరువు త్వరగా తగ్గుతారు కూడా.
* ఫ్రూట్స్
పండ్లు తినడం వల్ల శరీరం ఎక్కువ శాతం నీరు చేరుతుంది. ఇది మీ పొట్టను చాలా హెల్దీగా ఉంచుతుంది. ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. ఓ సారి ట్రై చెయ్యండి. ట్రస్ట్ మీ ...చాలా తేడా కనిపిస్తుంది.