Sanddep Reddy Vanga:మైకేల్ జాక్సన్ బయోపిక్..ఆ తెలుగు హీరోతోనే.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లు అందరిలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈయన ఒకే సమయంలో తెలుగులో అటు హిందీలో  సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ హిట్ లు అందుకుంటున్నారు. ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఏ హీరో కైనా ఉంటుంది. అలాంటి సందీప్ రెడ్డి వంగ  ఏ సినిమా చేసిన యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కబీర్ సింగ్, అనిమల్ సినిమాలు కూడా బంపర్ హిట్ కొట్టాయి.


Published Jul 07, 2024 05:03:00 PM
postImages/2024-07-07/1720349768_vanga.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లు అందరిలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈయన ఒకే సమయంలో తెలుగులో అటు హిందీలో  సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ హిట్ లు అందుకుంటున్నారు. ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఏ హీరో కైనా ఉంటుంది. అలాంటి సందీప్ రెడ్డి వంగ  ఏ సినిమా చేసిన యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కబీర్ సింగ్, అనిమల్ సినిమాలు కూడా బంపర్ హిట్ కొట్టాయి.

అంతే కాదు తెలుగులో విజయ్ దేవరకొండకు  లైఫ్ ఇచ్చింది కూడా సందీప్ రెడ్డి వంగా అని చెప్పవచ్చు. ఈ విధంగా అద్భుతమైన కథలను ఎంచుకుంటూ అద్భుత డైరెక్షన్ తో  వరుస విజయాలు అందుకుంటున్న సందీప్ రెడ్డి వంగ  మైకేల్ జాక్సన్ జీవిత కథతో ఒక సినిమా చేయబోతున్నారట. అంతేకాదు అందులో హీరో కూడా తెలుగువారినే తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. అయితే సందీప్ రెడ్డి వంగ ఈ మధ్యకాలంలో ప్రభాస్ పై పడింది. ఆయన కటౌట్ కు తగ్గట్టు ఒక సినిమా తీయాలనుకుంటున్నారట.

అంతేకాదు ఆ సినిమా పేరు కూడా బయటకు అనౌన్స్ చేశారు. అదే స్పిరిట్..  ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ చిత్రం తర్వాత ఆయన మైకేల్ జాక్సన్ బయోపిక్ చేనున్నారట. ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేసి, అల్లు హీరోను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో అద్భుత డాన్సర్ గా పేరుపొందిన అల్లు అర్జున్ ఈ సినిమాకు అయితే బాగా సెట్ అవుతారని ఆయన భావించారట. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో  బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత  అల్లు అర్జున్ ను మైకల్ జాక్సన్ బయోపిక్ లో నటించాలని సందీప్ రెడ్డి వంగ అడుగుతారని తెలుస్తోంది. మరి చూడాలి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం  టాలీవుడ్ కోటలు బద్దలు కావాల్సిందే అని  అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : prabhas news-line allu-arjun spirit sandeep-reddy-vanga maichek-jackson

Related Articles