ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు తీపి కబురు చెప్పింది. వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: సచివాలయంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. రేషన్ దుకాణాలలో సబ్సిడీ ధరలకు గోధుమలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు తీపి కబురు చెప్పింది. వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పిడియస్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి అని, పిడియస్ బియ్యం పట్టుబడితే డీలర్ షిప్ రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఉపేక్షించేది లేదని, రేషన్ డీలర్ల ఆదాయం పెంపుకు ప్రణాళికలు చేయాలని సూచించారు. వారి న్యాయమైన కోర్కెల పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు సంబంధించి 1,629 రేషన్ డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మహాలక్ష్మి పధకం లబ్ధిదారులకు చేరుతున్న సబ్సిడీ విషయం లబ్ధిదారులకు చేరవేయ్యాలి మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.