ముంబాయిలోని ఫేమస్ స్టూడియోస్ లో జరిగిన ఈ ఈవెంట్ లో నిఖిత విజయం సాధించింది. అయితే ఈ ఏడాదికి మిస్ ఇండియానే నిఖిత పోర్వాల్ గా డిసైడ్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని నిఖిత పోర్వాల్ దక్కించింది. ముంబాయిలోని ఫేమస్ స్టూడియోస్ లో జరిగిన ఈ ఈవెంట్ లో నిఖిత విజయం సాధించింది. అయితే ఈ ఏడాదికి మిస్ ఇండియానే నిఖిత పోర్వాల్ గా డిసైడ్ చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఈమె మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక తాజాగా జరిగిన ఈవెంట్లో రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్న రప్‌లుగా నిలిచారు. ఈమెకు మిస్ ఇండియా 2024 కిరీటాన్ని 2023 విజేత నందిని గుప్తా కిరీటాన్ని పెట్టింది. నిఖిత గురించి మిస్ ఇండియాగా గెలవడంతో నిఖితా పోర్వాల్ ఇప్పుడు సూపర్ వైరల్ అవుతుంది.
నికిత పోర్వాల్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అమ్మాయి. అక్కడే కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. ప్రస్తుతం బరోడాలోని మహారాజా షాయాజీరావు యూనివర్సిటీలో చదువుతుంది. టీవీ యాంకర్ గా తన 18 యేళ్ల వయసులో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆహెకు చిన్న చిన్న సినిమాల్లో నటించడం కూడా స్టార్ట్ చేస్తుంది. ఆమె సినిమా ఒకటి నేషనల్ సినిమా ఉత్సవాల్లో కూడా ప్రదర్శించారు. నిఖిత థియేటర్ ఆర్టిస్ట్ కూడా ..కృష్ణ లీల అని పిలిచే నాటకాన్ని ఆమె రాసింది అది కూడా 250 పేజీల నాటకం రాసింది.
ఈ మిస్ ఇండియా పోటీలు అక్టోబర్ 16న ముంబైలోని ఫేమస్ స్టూడియోలో నిర్వహించారు. ప్రతి భారతీయ రాష్ట్రం నుంచి 30 మంది పోటీదారులు పాల్గొన్నారు. నికిత మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో రేఖ పాండాయ్ నిలిచింది. ఇక మూడో స్థానంలో గుజరాత్ కు చెందిన ఆయుషి ధోలాకియా నిలిచింది. ఇప్పుడు నిఖిత మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించినట్లే. ఆమె భారతీయ అందాన్ని, సంస్కృతిని, విలువలను విదేశాలకు తీసుకెళ్లే రాయబారిగా వ్యవహరిస్తుంది.