Top Websites: ఈ వెబ్​ సైట్లను ఎంత మంది చూస్తారో తెలుసా?

కొన్ని వేల వెబ్ సైట్లు ఉన్నాయి. వారిలో ఎవరు ఎక్కువ ఏ వెబ్ సైట్ చెక్ చేస్తారో తెలుసా .. ప్రతి సైట్ కు ఓ లెక్క ఉంటుంది. వ్యూస్ మీదే


Published Nov 18, 2024 05:28:00 PM
postImages/2024-11-18/1731931126_some3dsocialmediaicons.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇంటర్ నెట్ లేనిది ఇఫ్పుడు ప్రపంచం లేదు. నిత్యావసర వస్తువులు లేకుండా అడ్జస్ట్ అవుతారు కాని ఫోన్ , నెట్ లాంటి అత్యవసరం . కొన్ని వేల వెబ్ సైట్లు ఉన్నాయి. వారిలో ఎవరు ఎక్కువ ఏ వెబ్ సైట్ చెక్ చేస్తారో తెలుసా .. ప్రతి సైట్ కు ఓ లెక్క ఉంటుంది. వ్యూస్ మీదే ...ఆ సైట్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఆ డీటైల్స్ చూసేద్దాం.


* గూగుల్ ..ప్రపంచంలో అత్యధిక మంది చూసే వెబ్ సైట్లలో టాప్ గూగుల్ సైటే. అసలు జ్వరం కాదు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా గూగుల్ మీదే ఆధారపడేవారు కోట్లలో ఉన్నారు. ఫోన్ ఉంటే గూగుల్ ఉండాల్సిందే ...కొంతమందికి సర్చింగ్ కు మరో ఆప్షన్ ఉందని కూడా తెలీదు. మనకు కావాల్సింది గూగుల్ కంటే స్పీడ్ గా ఎవరు తీసుకురాలేరు. అయితే  ఈ వెబ్ సైట్ కు సగటున నెలకు 8,310 కోట్ల వ్యూస్ వస్తుంటాయి.


* యూట్యూబ్...రెండో స్థానంలో ఉన్నది యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ దే కదా హవా అంతా.ఈ వెబ్ సైట్ కు సగటున నెలకు వచ్చే వ్యూస్... 2,960 కోట్లు


*ఫేస్ బుక్  ..మనుషులు ఎంత దూరంలో ఉన్నా దగ్గర ఫ్రెండ్స్ ను దగ్గర చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు కాస్త హవా తగ్గింది. కాని ఇంకా ఫేస్ బుక్ వాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ వెబ్ సైట్ కు నెలకు సగటున 1,270 కోట్ల వ్యూస్ వస్తుంటాయి.


* ఇన్ స్టాగ్రామ్...ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నదే..రీల్స్ ...వీడియోస్ ..చాలా ఫామ్ లో ఉంది. దీనికి నెలకు సగటున వచ్చే వ్యూస్ 590 కోట్లు


* ఎక్స్ ను సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల దాకా తమ అభిప్రాయాలను, భావాలను పంచుకునే వేదికగా మారింది. ‘ఎక్స్’కు సగటున నెలకు వచ్చే వ్యూస్... 470 కోట్లు


* వాట్సాప్..ఇప్పుడు మెసేజ్ అంటేనే వాట్సాప్ ..మరొక ఆలోచనే లేదు. దీనికి నెలకు సగటున వచ్చే వ్యూస్... 450 కోట్లు ఇలా కోట్లలో వ్యూస్ ..లైక్స్ సంపాదించుకుంటున్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : instagram whatsapp face-book google-voice

Related Articles