GOAT: విజయ్ 'గోట్' ట్రైలర్ అప్‌డేట్

ఆదివారం మూవీయూనిట్ ఈ సినిమా సంబంధించిన ట్రైలర్‌పై అదిరిపోయే అప్‌డేట్ అందించారు.


Published Aug 11, 2024 09:44:46 AM
postImages/2024-08-11/1723387396_vijay.PNG

న్యూస్ లైన్ సినిమా: త‌మిళ‌ స్టార్ హీరో దళపతి విజయ్ న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ మూవీకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండ‌గా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్‌ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఆదివారం మూవీయూనిట్ ఈ సినిమా సంబంధించిన ట్రైలర్‌పై అదిరిపోయే అప్‌‌డేట్ అందించారు.

ఈ మూవీ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఈ విషయాన్ని తెలుపుతూ ఓ కొత్త పోష్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ గన్ పట్టుకుని ఉన్న విజువల్స్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్, ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : tollywood release movie-news goat-of-all-time vijay-thalapathy

Related Articles