MS SUBBALAKSHMI: ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌ కోసం నలుగురు హీరోయిన్లు.? 2024-06-25 21:17:20

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: MS సుబ్బలక్ష్మి (ms subbalakshmi)తెలియని తెలుగు వారుండరు. సుప్రభాతసేవ( suprabhatam) నుంచి ఆమె పాట వింటూనే ఉంటాం. ఎంత మంచి పాటలు..ఎన్ని వేల కచేరీలు ఇంతటి గొప్ప సింగర్ లైఫ్ భావితరాలకు తెలియాల్సిందే. అందుకే ఎం ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం సర్వం సిధ్ధమవుతున్నాయి. 
అయితే ఈ సారి ఈ బయోపిక్‌( biopic) కోసం నలుగురు హీరోయిన్ల పేర్లు .ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి అందులో నయనతార( nayanatara), రష్మిక మందన్నా, త్రిష, కీర్తిసురేష్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.  ఈ బయోపిక్‌ కోసం మేకర్స్ ఈ నలుగురుని సంప్రదించారట. . చాలా మంది నయనతార పేరు చెబుతున్నారు. ఆమె ఓకే అయ్యిందన్నారు. అలాగే త్రిష పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. కాని కీర్తిసురేష్ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది.


తను కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు ఇప్పుడు మెయిన్‌గా వినిపిస్తున్నాయి. `మహానటి`లాంటి  మూవీలో నటించి అదరగొట్టింది కీర్తి సురేష్‌( keerthi suresh) . సావిత్రి అంటే ఇలానే  ఉంటుందేమో అని ఈ తరానికి అనిపించేలా చేసింది. ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. ఈ మూవీని రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించబోతున్నారట. డైరక్టర్ పేరు బయటపెట్టలేదు. సినిమా డీటైల్స్ తెలీదు. కాని గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సినిమా వస్తుంది. కీర్తి పేరు వినిపిస్తుందని మాత్రం తెలుసు.


కీర్తిసురేష్‌ తమిళంలో( tamil)  మూడు సినిమాలున్నాయి. అందులో `రాఘుతాత`, `రివాల్వర్‌ రీటా`, `కన్నివేడి` చిత్రాలుండగా,  హిందీలో వరుణ్‌ ధావన్‌తో కలిసి `బేబీ జాన్‌` చేస్తుంది. ఇందులో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంటుందని తెలుస్తుంది. దీంతోపాటు అక్షయ్‌ కుమార్‌తో ఓ సినిమాకి  చర్చలు జరుగుతున్నాయని టాక్‌. ఎంఎస్‌ సుబ్బలక్ష్మి తమిళంలోని మధురైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె గాయనిగా ఎదిగే క్రమంలో అనేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేశారు. కర్ణాటక సంగీతంలో ఆరితేరిన ఆమె...లైఫ్ లో చాలా ఆటుపోట్లు చూస్తూ ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చారు