murari : మురారి మానియా ...థియేటర్లో పెళ్లి చేసుకున్న ప్రేమికులు !

ఆగస్టు 9న మురారి చిత్రం రీ-రిలీజ్ అయ్యింది . ఇందుకు గాను టికెట్ల బుకింగ్స్  ఆగస్టు 3 మొదలయ్యాయి.


Published Aug 09, 2024 03:31:00 PM
postImages/2024-08-09/1723197783_murari.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు మహేష్ బబాబు ...అందం తింటున్నాడా అన్నట్లు ఉన్నాడు. ఎప్పుడో వచ్చినా మురారి కి ఇప్పటి మహేష్ కు తేడానే లేదు. ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటున్నాడు. గ్లామర్ సీక్రెట్ ఏంటని అడగగా..తక్కువ తింటాను ...తక్కువ మాట్లాడతాను ఇదే సీక్రెట్ అంటుంటారు. ఇప్పుడు మురారి సినిమా సూపర్ ట్రెండ్ లో అమ్ముడవుతున్నాయి. థియేటర్ల లో మురారి సినిమా చూస్తూ పెళ్లి చేసుకుంటున్నారు.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈనెల ఆగస్టు 9వ తేదీన 49వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మహేశ్ హీరోగా నటించిన క్లాసిక్ మూవీ ‘మురారి’ రీ-రిలీజ్ కానుంది. 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి అడుగుపెడుతోంది.23 యేళ్ల క్రితం చూసిన మహేష్ బాబు ..ఇప్పుడు మహేష్ ఒకేలా ఉన్నారు...ఏంటి సార్  ఈ అందం అంటున్నారు జనాలు. అయితే మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి చిత్రం రీ-రిలీజ్ అయ్యింది . ఇందుకు గాను టికెట్ల బుకింగ్స్  ఆగస్టు 3 మొదలయ్యాయి.


మురారి చిత్రం రీ-రిలీజ్‍కు 4కే టెక్నాలజీతో వచ్చింది . ఇటీవలే వచ్చిన రీ-రిలీజ్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. రీ-రిలీజ్ కోసం 18 నిమిషాల రన్‍టైమ్‍ను కూడా మేకర్స్ తగ్గించారు. సుమారు 2 గంటల 42 నిమిషాల రన్‍టైమ్‍‍తో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే కాకినాడ  తిరుమల థియేటర్ లో మురారీ సినిమా చూస్తూ ప్రేమికులకు తన ఫ్రెండ్స్ అక్షింతలు చల్లి ఆశీర్వదించిన ప్రేక్షకులు కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లోనూ ఇదే తరహా సీన్ వైరల్ అవుతున్న మరికొన్ని వీడియోలు. పెళ్లి పాట అంటే ఈ మురారి సినిమా పాటనే ...ఇప్పటికీ ఈ పాటను ఎవ్వరు బీట్ చెయ్యలేరు ..మరింత సూపర్ హిట్ట్ గా నడుస్తుంది మురారి.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mahesh-babu sonali-bindre murari-re-release

Related Articles