నాబార్డ్ లో ఉద్యోగాలు పడ్డాయి. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: యూత్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ..అంత బాధ్యతగా కూడా ఉన్నారు. సెటిల్ అయితే మాత్రం చాలా బాగా సెటిల్ అవుతున్నారు. చాలా వరకు యువతకు ఆర్ధిక నిబధ్దత ఉంటుంది. అయితే ఉద్యోగాలకు మాత్రం చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు.వారికి ఈ విషయం గుడ్ న్యూసే. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏ చింతా లేకుండా ఉండొచ్చు. టైమ్ కు జీతం, సెలవులు, ప్రభుత్వం కల్పించే వివిధ అలవెన్సులు, సౌకర్యాలతో లైఫ్ బిందాస్ గా గడిపేయొచ్చు. ప్రైవేట్ సెక్టార్ లో శాలరీలు ఎక్కువగా ఉన్నా మెంటల్ ప్రెజర్. అయితే జీతం బాగుండాలి..లేదా మెంటర్ ప్రెజర్ లేని ఉద్యోగం ఉండాలి. నాబార్డ్ లో ఉద్యోగాలు పడ్డాయి. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దీని ద్వారా 108 ఆఫీస్ అటెండెంట్-గ్రూప్ సీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జస్ట్ పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 యేళ్ల లోపు వారికి అప్లై చేసుకునే అర్హత ఉంది. ఫస్ట్ ఆన్ లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ పాసైతే నెలకు 35 వేలు బేసిక్ తో హ్యాపీగా జాబ్ లో జాయిన్ అవ్వొచ్చు.అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 21వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.nabard.org/ వెబ్‌సైట్ ను విజిట్ చెయ్యండి.