Naga Chaitanya: ఇది మీకే సిగ్గుచేటు.. కొండా సురేఖ పై నాగచైతన్య ఫైర్..?

మంత్రి కొండా సురేఖ తన విడాకులపై చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య ఖండించాడు. ఎక్స్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. జీవితంలో అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన నిర్ణయాల్లో విడాకులు ఒకటని


Published Oct 03, 2024 11:34:47 AM
postImages/2024-10-03/1727935487_kondasurekhanacga.jpg

కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య
అబద్ధపు ప్రచారం చేస్తున్నారు

ఎంతగానో ఆలోచించిన తర్వాతే విడాకులు 

న్యూస్ లైన్ డెస్క్: మంత్రి కొండా సురేఖ తన విడాకులపై చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య ఖండించాడు. ఎక్స్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. జీవితంలో అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన నిర్ణయాల్లో విడాకులు ఒకటని పేర్కొన్నాడు. ఎంతగానో ఆలోచించిన తర్వాతే తాను, తన మాజీ భార్య విడిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇది శాంతియుతంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.

అయితే తమ విడాకుల గురించి ఇప్పటివరకు నానారకాలుగా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాజీ భాగస్వామితో పాటు తన కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇంతకాలం మౌనంగానే ఉన్నానన్నారు. కానీ ఈ రోజు మంత్రి కొండా సురేఖ అబద్ధపు ప్రచారానికి పూనుకున్నారన్నారు. ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని, మీడియా హెడ్‌లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఓ నోట్‌ విడుదల చేశాడు.

newsline-whatsapp-channel
Tags : news-line ktr samantha naga-chaithanya konda-surekha

Related Articles