Naga Chaitanya: స్టార్ హీరోయిన్ తో నాగచైతన్య లవ్.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్?

అక్కినేని ఫ్యామిలీ అంటేనే చాలామందికి గుర్తుకు వచ్చేది ఏఎన్ఆర్. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్ అని చెప్పవచ్చు.అయితే నాగచైతన్య  తాజాగా ఒక కొత్త సినిమాలో నటించబోతున్నారట. ఇందులో ఆయన పాత్ర డబుల్ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని కార్తీక్ దండు డైరెక్షన్ చేస్తున్నారని సమాచారం. విరూపాక్ష చిత్రంతో మంచి పేరు తెచ్చుకొని అదే అంచనాలతో మరో సినిమాని నాగచైతన్యతో చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చైతు రెండు విభిన్న పాత్రలో నటిస్తారని ఇందులో సరికొత్త లుక్ ఉంటుందని సమాచారం.  అంతేకాకుండా ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నాగచైతన్యతో చేయబోతుందట.  వీరి మధ్య అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ ఉంటుందని, చిత్రం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.


Published Jul 16, 2024 10:19:09 AM
postImages/2024-07-16/1721134152_pooja.jpg

న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని ఫ్యామిలీ అంటేనే చాలామందికి గుర్తుకు వచ్చేది ఏఎన్ఆర్. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్ అని చెప్పవచ్చు.  అలాంటి ఏఎన్నార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని నాగార్జున ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు.  ఇప్పటికీ ఆరుపదల వయస్సు దాటిన ఆయన సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.  అలాంటి  నాగార్జున నట వారసులుగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

కానీ ఇప్పటికీ స్టార్ హీరోలుగా ఎదగలేక పోతున్నారు. కేవలం నాగచైతన్య మాత్రమే ఓ మోస్తారుగా దూసుకుపోతున్నా, అఖిల్ పూర్తిగా వెనుకబడి పోయారు. అయితే నాగచైతన్య  తాజాగా ఒక కొత్త సినిమాలో నటించబోతున్నారట. ఇందులో ఆయన పాత్ర డబుల్ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని కార్తీక్ దండు డైరెక్షన్ చేస్తున్నారని సమాచారం. 

విరూపాక్ష చిత్రంతో మంచి పేరు తెచ్చుకొని అదే అంచనాలతో మరో సినిమాని నాగచైతన్యతో చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. చైతు రెండు విభిన్న పాత్రలో నటిస్తారని ఇందులో సరికొత్త లుక్ ఉంటుందని సమాచారం.  అంతేకాకుండా ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నాగచైతన్యతో చేయబోతుందట.  

వీరి మధ్య అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ ఉంటుందని, చిత్రం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని,  అలాగే ఈ మూవీని వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తోంది. అలాంటి ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త బయటకు రావడంతో  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya anr pooja-hegde karthik-dandu

Related Articles