అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, తర్వాత నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు.నాగచైతన్య అయితే ఓ మోస్తరుగా స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్నారు. అలాంటి నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ మూవీ చేస్తున్నారు. నాగచైతన్య తన సొంత కెరియర్ లో తాను ఏం చేయాలనుకుంటున్నారో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నాగచైతన్య పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి పుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో కూడా చెప్పారు. తనకు ఇష్టమైన ప్లేస్ గోవా అని అక్కడే సెట్ అవుతానని అన్నారు. అంతేకాకుండా 45 ఏళ్లు వచ్చే సమయానికి నేను సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి గోవాలోనే ఉండిపోతానని, వీలైతే సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేస్తానని, గోవాలో సెట్ అవ్వడం నా కళ అంటూ చెప్పుకొచ్చారు. దానికోసం ఆయన ఎప్పటినుంచో ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారట.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే చాలావరకు అక్కినేని, మెగా, అల్లు, నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలే ఎక్కువగా ఉంటారు. ఇందులో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలు మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు. అలాగే మెగా, అల్లు ఫ్యామిలి నుంచి కూడా చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, తర్వాత నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు కానీ అఖిల్ పూర్తిగా డిజాస్టర్ హీరోగా మిగిలిపోయారు. ఇక నాగచైతన్య అయితే ఓ మోస్తరుగా స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్నారు.
అలాంటి నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ మూవీ చేస్తున్నారు. ఇదే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే నాగచైతన్య సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. తన సొంత కెరియర్ లో తాను ఏం చేయాలనుకుంటున్నారో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నాగచైతన్య త్వరలోనే ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారట. ఇదే తరుణంలో ఆయన తన ఫేవరెట్ ప్లేస్ గురించి తెలియజేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. నాగచైతన్య చెన్నైలో పుట్టి పెరిగారు. అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి నాగచైతన్య డిగ్రీ చేయడం కోసం హైదరాబాద్ వచ్చారు.
అక్కడ సెయింట్ మేరీస్ కాలేజీలో బీకాం పూర్తి చేసి సమ్మర్ వెకేషన్స్ లో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ కూడా పూర్తి చేశారు. అయితే ఆయన ముంబైలో ఉన్న సమయంలో టాక్సీ లోనే తిరిగేవారట. ముంబైలో ఉన్నా కానీ నాగచైతన్యకు ఇప్పటికీ హిందీ రాదని చెబుతుంటారు. అంతేకాకుండా చిన్నతనంలో తన తల్లి లక్ష్మితో కలిసి ట్రైన్ లో ముంబైకి వెళ్లాలని, ఒకసారి హైదరాబాద్ కూడా వచ్చారని అన్నారు. అలా నా జీవితంలో రెండుసార్లు మాత్రమే ట్రైన్ జర్నీ చేశానని అది మర్చిపోలేనని తెలియజేశారు. హైదరాబాద్, చెన్నై పేరు చెప్పగానే దోష, చికెన్ కర్రీ, కీమా దోశ, మటన్ కర్రీ, గుర్తుకు వస్తాయని అన్నారు..
అలాంటి నాగచైతన్య పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి పుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో కూడా చెప్పారు. తనకు ఇష్టమైన ప్లేస్ గోవా అని అక్కడే సెట్ అవుతానని అన్నారు. అంతేకాకుండా 45 ఏళ్లు వచ్చే సమయానికి నేను సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి గోవాలోనే ఉండిపోతానని, వీలైతే సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేస్తానని, గోవాలో సెట్ అవ్వడం నా కళ అంటూ చెప్పుకొచ్చారు. దానికోసం ఆయన ఎప్పటినుంచో ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారట. దీన్ని బట్టి చూస్తే మాత్రం నాగచైతన్య డబ్బులన్ని పోగేసి గోవాలో లగ్జరీ హౌస్ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.