అక్కినేని హీరో నాగ చైతన్య అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈయన హీరోగా ఓ మోస్తారుగా గుర్తింపు పొందినా కానీ, సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా వైరల్ అయ్యారు. ఈ విధంగా ఇండస్ట్రీలో
న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని హీరో నాగ చైతన్య అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈయన హీరోగా ఓ మోస్తారుగా గుర్తింపు పొందినా కానీ, సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా వైరల్ అయ్యారు. ఈ విధంగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నాగచైతన్య సమంత నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాదు మరోవైపు సమంత కూడా తన సినిమాలపై దృష్టి పెట్టి దూసుకుపోతోంది.
ఆ మధ్యకాలంలో కాస్త అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వాటి నుంచి బయటపడి మళ్లీ సినిమాల్లో రాణిస్తోంది. ఈ విధంగా ఇద్దరు ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్న తరుణంలో మీరు విడాకుల ప్రస్తావన గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే తాజాగా నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య శోభిత ధూళిపాల గత కొన్ని రోజులుగా లవ్ లో ఉన్నారని వీరిద్దరూ పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నారని వార్తలు వినిపించాయి.
అలాంటి ఈ తరుణంలో తాజాగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. అలాంటి ఈ తరుణంలో సమంత ఒక షాకింగ్ పోస్ట్ చేసింది. అది నాగచైతన్యను ఉద్దేశించి పోస్ట్ చేసిందా లేదంటే తన లైఫ్ గురించి చెబుతూ పోస్ట్ చేసిందా అనేది తెలియదు కానీ ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆమె ఏమన్నది అంటే.. కష్టాలను ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరివాళ్లు కారని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ పోస్టులో రాసుకొచ్చింది. మేమంతా వినేష్ పోగట్ కు అండగా ఉన్నాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లను పైనుంచి ఓ శక్తి కాపాడుతుంది. ఎల్లప్పుడూ ఆసక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుంది. ఇలాంటి టైంలోని మానసిక ధైర్యంతో ఉండాలి. మేమంతా మీకు అండగా ఉంటామంటూ దినేష్ పొగట్ గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.