తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరుపొందిన హీరో నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. ఏఎన్ఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆరు పదుల వయస్సు దాటినా కానీ
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరుపొందిన హీరో నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. ఏఎన్ఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆరు పదుల వయస్సు దాటినా కానీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికి కూడా నాగార్జున చాలా యంగ్ గా కనిపిస్తూ యువ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటారు. అలాంటి ఈయన కొన్ని కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే మరికొన్ని వైవిద్యమైన పాత్రల్లో, సినిమాలు చేస్తూ అగ్ర హీరోల లిస్టులో టాప్ పోజీషన్ లో ఉన్నారని చెప్పవచ్చు.
అలాంటి నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29న జరగనుంది. ఇదే తరుణంలో నాగార్జునకు సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అక్కినేని నాగార్జున హీరోగా రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ మూవీ 'మాస్' ఈ సినిమా అంటే తెలియని వారు ఉండరు. ఈ చిత్రం టీవీల్లో వస్తే ఇప్పటికి కళ్ళు అర్పకుండా చూస్తుంటారు. అలాంటి ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోలో తెరకెక్కించారు. 2004లో వచ్చినటువంటి ఈ చిత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సినిమాను ఆగస్టు 29న నాగార్జున బర్త్డే సందర్భంగా మరోసారి రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దీన్ని 28వ తారీకున ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలకు సంబంధించిన పుట్టినరోజులు ఇతర వేడుకల సందర్భంగా పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు 'మురారి' చిత్రం రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన హిట్ సాధించింది. అలాగే నాగార్జున 'మాస్' ఆగస్టు 28న థియేటర్లోకి తీసుకురానున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.