ఇక అక్కినేని ఇంటికి ఆమె కోడలుగా వెళ్లనున్న టైం దగ్గర పడుతున్న టైంలో.. నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: హీరో నాగార్జున తనకు కాబోయే కోడలు శోభిత ధూళిపాళ గురించి నాటు వ్యాఖ్యలు చేశారు. నాగార్జున తనయుడు నాగచైతన్య శోభితతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ టైంలోనే ఓ సినిమా ఆడియో లాంచ్‌లో మాట్లాడుతూ ఆమెపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అడవి శేషు మేజర్ సినిమా సమయంలో నాగచైత్యన్యతో శోభితకు పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ పలు మార్లు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా, ఇటీవల ఓ ఫారిన్ వెకేషన్‌లో కూడా కలిసి తిరుగుతున్న వీరి ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.
నటి శోభిత ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు చాలా కాలంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూరప్ ట్రిప్‌లో రెస్టారెంట్‌లో తీసుకున్న ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. దీంతో ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం వచ్చి చేరింది.
ఇక గురువారం నాగార్జున ఇంట్లో శోభితతో చైతు ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఓ వైపు ఎంగేజ్‌మెంట్ హంగామా నడుస్తుంటే.. కాబోయే కోడలుపై నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గూఢచారి సినిమా ఆడియో లాంచ్‌కు వెళ్లిన నాగార్జున.. సినిమాలో శోభిత చాలా బాగా నటించిందని అన్నారు. సినిమాలో ఆమె చాలా హాట్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఆమెలో ఏదో అట్రాక్షన్ ఉందని అన్నారు. ఇక అక్కినేని ఇంటికి ఆమె కోడలుగా వెళ్లనున్న టైం దగ్గర పడుతున్న వేళ.. నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Hmmmmm.... Nagarjunnaaaaaaaa https://t.co/Z8MOsyQVsu pic.twitter.com/6liAejbBnM — Vasu (@vasu1748) August 7, 2024