'లఫంగి' అంటూ బిగ్ బాస్ ను తిట్టినా కంటెస్టెంట్.. గెంటేసిన నాగార్జున.!

ఈవారం బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ జరిగింది. హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు లిమిట్ దాటి మరీ మాట్లాడుతున్నారు.  ఇది ప్రజలు చూస్తారు, లైవ్ షో అని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ


Published Sep 22, 2024 08:06:01 AM
postImages/2024-09-22/1726972561_abhai.jpg

న్యూస్ లైన్ డెస్క్:ఈవారం బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ జరిగింది. హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు లిమిట్ దాటి మరీ మాట్లాడుతున్నారు.  ఇది ప్రజలు చూస్తారు, లైవ్ షో అని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ కొట్టుకోవడం, తిట్టుకోవడం, రొమాన్స్ చేయడం వంటివి చేస్తున్నారు.  దీంతో బిగ్ బాస్ షోపై చాలామంది ప్రజలకు ఆసక్తి తగ్గుతోంది. ఇక  తాజాగా కంటెస్టెంట్ ఆ అభయ్  తన నోటి దురుసుతో బిగ్ బాస్ ని దారుణంగా తిడుతూ సెటైర్లు వేశాడు. సీరియస్ అయిన నాగార్జున ఆ వ్యక్తిని గెటవుట్ అంటూ రెడ్ కార్డు చూపించాడు..

మూడో వారం ఎండింగ్ వచ్చేసరికి ఈ సీన్ అంత జరిగినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా  ప్రోమోలో నాగార్జున రెడ్ కార్డు చూపిస్తున్నటువంటి ఒక  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అభయ్ లఫంగి  అంటూ మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అయిపోయాయి. దీంతో నాగార్జున ఒక కర్ర, రెడ్ కార్డు పట్టుకొని మరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి  అభయ్ ని గెటవుట్ అంటూ గేట్లు తెరిపించాడు.

అయితే అభయ్ లఫంగి అనడమే కాకుండా వారం మొత్తంలో ఆయనకే తెలియదు ఏమవుతుందో, ఆయన వాళ్ల పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టుగా ఉన్నాడు. నా వాయిస్ వేసి వాళ్ళ ముఖాలు వేసి ఇలాంటి లఫంగి ఎడిట్ చేయకండి, మీరు నా వాయిస్ నా ముఖమే వేయండి..  నువ్వు  బిగ్ బాస్  కాదు బయస్డ్  బాస్. బయట ఇంటర్వ్యూ కి వెళ్ళినా కానీ ఇదే మాట చెప్తాను లిమిట్ లెస్ బయస్డ్ బిగ్ బాస్. అంటూ అభయ్ అన్న మాటలను ప్రోమోలో చూపించారు.  

అంతేకాదు ఇది శనివారం ప్రసారం కూడా అయింది. ఈ విధంగా అభయ్ హౌస్ లో రెచ్చిపోవడంతో ఆయనపై విపరీతమైనటువంటి మైనస్ వచ్చింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో అభయ్ కూడా ఉన్నాడు. సెల్ఫ్ నామినేట్ అయి ఆ లిస్టులో ఉన్న  అభయ్ ఈవారం తప్పక హౌస్ నుంచి బయటకు వెళ్తారని తెలుస్తోంది.

https://youtu.be/0D8XBsxaR4s?si=8q9uWSx-BZbA4-_1

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna prudhvi-raj big-boos8 aakula-sonia abhai red-card

Related Articles