NANI : నాని కి వింత సమస్యలు .. ఇదంతా ఆ సినిమా వల్లేనా !

ఆగష్టు సినిమా లవర్స్ కు పండగే పండగ. కొత్త సినిమాలు ..థియేటర్లో హడావిడి చేస్తాయి. దానికి తోడు ఈ సారి రీరిలీజ్ లు కూడా ఉన్నాయి. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ సినిమాలు, ఆగష్టు 29న నాని సరిపోదా శనివారం మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.


Published Jul 26, 2024 01:41:00 PM
postImages/2024-07-26/1721981513_nani1.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆగష్టు సినిమా లవర్స్ కు పండగే పండగ. కొత్త సినిమాలు ..థియేటర్లో హడావిడి చేస్తాయి. దానికి తోడు ఈ సారి రీరిలీజ్ లు కూడా ఉన్నాయి. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ సినిమాలు, ఆగష్టు 29న నాని సరిపోదా శనివారం మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే అందరికి కొత్త సినిమాలతో ప్రాబ్లమ్ వస్తే ...నాని సరిపోదా శనివారానికి మాత్రం పాత సినిమాలే ప్రాబ్లమ్. రీరిలీజ్ లు కూడా అన్ని మంచి సినిమాలే ...కాబట్టి కాస్త ఆడియన్స్ గాలి అటు మళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కలక్షన్లు దెబ్బపడుతుందేమోనని నాని భయం.


ఆగష్టు 9 మురారీ సినిమా.. ఆగష్టు 22 న ఇంద్ర మూవీ రీరిలీజ్ , ఆగష్టు 29 న.. నాగార్జున మాస్ మూవీని రీరిలీజ్ చేయనున్నారు. ఒకవేళ ఆ సినిమాకు కనుక ఎక్కువ థియేటర్స్ ఇస్తే.. సరిపోదా శనివారం నష్టపోవాల్సిందే. ఇక వెంటనే సెప్టెంబర్ 2 న.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అసలే డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చే సినిమా దుమ్ములేపేస్తారంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు...వీటన్నింటి మధ్యలో నాని ...నలిగిపోతాడేమోనని భయం.


ఒకవేళ జనాలంతా రీరిలీజ్ కె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం.. కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకు కాస్త ప్రభావం పడుతుంది. కానీ ఒక్కసారి ఫస్ట్ షో కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. కలెక్షన్స్ కూడా ఊపందుకుంటాయి. ఎలా అయినా కలక్షన్లు మాత్రం తగ్గుతాయనే అంటున్నారు మూవీ సీనియర్స్.
 

newsline-whatsapp-channel
Tags : movie-news nani murari

Related Articles