GAME CHANFGER: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అంటున్న నెటిజన్లు...కృష్ణ వంశీ ఏమన్నారంటే

కృష్ణవంశీ  ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ మురారి విశేషాలని పంచుకుంటున్నారు. మురారి చిత్రం గురించి ఫ్యాన్స్ కి అనేక విషయాలు చెబుతున్నారు. మురారీ రీ రిలీజ్ చేయబోతున్నారు.


Published Jul 22, 2024 10:01:00 PM
postImages/2024-07-22/1721665922_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  కృష్ణవంశీ  ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ మురారి విశేషాలని పంచుకుంటున్నారు. మురారి చిత్రం గురించి ఫ్యాన్స్ కి అనేక విషయాలు చెబుతున్నారు. మురారీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆగష్టు 9 న రీరిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఈ సారి గేమ్ ఛేంజర్ పై నెటిజన్ చేసిన కమెంట్ కు కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు.


రాంచరణ్ కోసం స్క్రిప్ట్ ఐడియా ఉంది. చరణ్ టైం ఇస్తే వెంటనే చిత్రాన్ని పూర్తి చేస్తాను అని కృష్ణ వంశీ తెలిపారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుందని ...శంకర్ అవ్ డేటెడ్ ఐడియాస్ సినిమాలు తీస్తున్నారని అన్నారు. దీంతో కృష్ణ వంశీ వెంటనే రిప్లై ఇచ్చారు. చరణ్ నా బిడ్డలాంటివాడు. గేమ్ ఛేంజర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అని తెలిపారు. శంకర్ మంచి విజన్ ఉన్న డైరక్టర్. అలా ఫ్లాప్ అని తీసిపారేయొద్దు అంటూ కామెంట్ చేశాడు.


దీనీకి నెటిజన్ ..జరగండి జరగండి సాంగ్ విన్న తర్వాత గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుంది అనిపిస్తోంది అని నెటిజన్ అన్నారు.  అలా మాట్లాడడం తప్పు. శంకర్ గొప్ప విజన్ ఉన్న దర్శకుడు. ఒక పాట చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు అని కృష్ణవంశీ ధీటుగా నెటిజన్లకు బదులిచ్చారు. ఇండియన్ -2 ఫ్లాప్ తర్వాత గేమ్ ఛేంజర్ పై జనాల కు ఇదే ఓపీనియన్ ఉంది. రిలీజ్ అయ్యి హిట్టు కొడతే కాని శంకర్ పై అభిప్రాయం మారదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shankar-director game-changer krishnavamshi

Related Articles