Nithya Menen: ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్న నిత్యామీనన్.?

నిత్య మీనన్ .. హైట్ తక్కువ ఉన్నా సరే ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళింది. కానీ ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది నిత్యమీనన్. కానీ అందివచ్చిన అవకాశాలు


Published Aug 12, 2024 05:11:00 PM
postImages/2024-08-12/1723455676_nithyamenon.jpg

న్యూస్ లైన్ డెస్క్: నిత్య మీనన్ .. హైట్ తక్కువ ఉన్నా సరే ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళింది. కానీ ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది నిత్యమీనన్. కానీ అందివచ్చిన అవకాశాలు అయితే మిస్ చేసుకోవడం లేదు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నిజంగానే ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుందా..ఇంతకీ నిత్యమీనన్ పెళ్లాడాలి అనుకున్న ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..

ఆయన ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్.. అయితే అప్పట్లో నిత్యమీనన్, దుల్కర్ మధ్య బాగానే డేటింగ్ వార్తలు వినిపించాయి. ఇక వీరి కాంబినేషన్లో మూడు నాలుగు సినిమాలు వచ్చేసరికి వీరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం గట్టిగా వినిపించింది.అయితే ఈ ప్రచారాలను ఈ జంట ఖండించకపోవడంతో ఇది నిజమే అని అందరూ భావించారు.

దుల్కర్ సల్మాన్ ఇంట్లో కూడా గొడవ జరిగిందట.ఎందుకంటే దుల్కర్ కి అప్పటికే పెళ్లయి ఓ పాప ఉంది. దాంతో ఇంట్లో భార్య గొడవ పెట్టడంతో ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. దాంతో అలర్ట్ అయిన దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి నిత్యమీనన్ ని ఇంటికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారట.

ఆ తర్వాత నిత్యమీనన్ దుల్కర్ తో తిరగకుండా సైలెంట్ అయిపోయిందట. అయితే ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగగా.. మా మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు.మేమిద్దరం చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఉంటాం.అప్పుడప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని దుల్కర్ ఆటపట్టించేవాడు అంటూ చెప్పుకొచ్చింది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood kollywood nithya-menen dulquer-salman mammootty

Related Articles