తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయన పెద్ద స్టార్ గా మారారు. అలాంటి ప్రభాస్ తాజాగా నటించి విడుదలైనటువంటి మూవీ కలికి 2898 ఏడి, ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. సినిమా సక్సెస్ అవ్వడంతో, ఆనందంలో చిత్ర యూనిట్ ఉండగానే మరో షాకింగ్ ఘటన జరిగింది. ఈ చిత్రంలో నటించినటువంటి మేకర్స్ కి నోటీసులు అందాయి.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయన పెద్ద స్టార్ గా మారారు. అలాంటి ప్రభాస్ తాజాగా నటించి విడుదలైనటువంటి మూవీ కలికి 2898 ఏడి, ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. సినిమా సక్సెస్ అవ్వడంతో, ఆనందంలో చిత్ర యూనిట్ ఉండగానే మరో షాకింగ్ ఘటన జరిగింది. ఈ చిత్రంలో నటించినటువంటి మేకర్స్ కి నోటీసులు అందాయి.
దీనికి కారణం ఈ చిత్రంలో కల్కి భగవానుడు గురించి గ్రంథాలను భిన్నంగా తప్పుగా చూపించారని, అమితాబ్, ప్రభాస్ లతో పాటు కల్కి యూనిట్ కు దాం పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణన్ లీగల్ నోటీసులు పంపాడు. హిందూ గ్రంధాలలో తెలిపిన దానికి వ్యతిరేకంగా ప్రొడ్యూసర్స్ దేవుళ్లను తప్పుగా చిత్రీకరణ చేశారని ఆయన ఆరోపణ చేశారు. తల్లి ( దీపిక) కృత్రిమ గర్భ ద్వారా కల్కి పుట్టబోతున్నాడని చూపించి వందల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాడని దానికే ఆయన నోటీసులు పంపినట్లు తెలియజేశాడు.
అయితే సుప్రీంకోర్టు న్యాయవాది విజువల్ ఆనంద్ శర్మ ఈ నోటీసులను వీరికి పంపించారు. ముఖ్యంగా ఈ కల్కి చిత్ర వర్ణాణ పూర్తిగా సరికాదని నోటీసులు తెలియజేశారు. హిందూ గ్రంథాలను వాడుకొని దానిని తప్పుగా చిత్రీకరించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కల్కి అవతారం అనేది విష్ణు యొక్క చివరి అవతారమని అనేక హిందూ పురాణాలు ఆయన గురించి వెల్లడించాయని చెప్పారు. ఈ విధంగా తప్పుగా చిత్రీకరించినందుకుగాను చిత్ర యూనిట్ కు ప్రభాస్, అమితాబచ్చన్ కు నోటీసులు అందజేశారు. అయితే మూడు వారాల క్రితం థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అద్భుతమైన వసూళ్లు చేసి ఘనవిజయాన్ని అందుకుంది.