ఈ క్రేజీ ట్రీ అమెరికాలో ఉంది. దీని పేరు కూడా అదే..క్రేజీ ట్రీ. ఇదో ఎక్స్ పర్మెంట్. సైరక్యూస్ యూనివర్సిటీ ఆర్టిస్ట్ సృష్టించిందే ఇది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జామపండు, మామిడిపండు. దానిమ్మ, ద్రాక్ష. ఆరెంజ్, ఆపిల్. బత్తాయి, బనానా. పనస, పైనాపిల్. ఈ ఫ్రూట్స్ కావాలా..? అయితే మీరా చెట్టు పెంచుకోవాల్సిందే. చెట్టొకటే...పండ్లే బోలెడు. ఇంతకీ ఏంటా ట్రీ. అంటే ఇదిగ ఈ స్టోరీ చదవాల్సిందే..
వింతగా ఉంది కదా. ఈ క్రేజీ ట్రీ అమెరికాలో ఉంది. దీని పేరు కూడా అదే..క్రేజీ ట్రీ. ఇదో ఎక్స్ పర్మెంట్. సైరక్యూస్ యూనివర్సిటీ ఆర్టిస్ట్ సృష్టించిందే ఇది. మూడు కాలాల్లోను ఏదో ఓక పండ్లు దిగుబడి వస్తూనే ఉంటుంది.
ఈ చెట్టు...ఒక్క వసంతకాలం తప్ప అన్ని కాలాల్లోను పచ్చగా, ఎరుపుగా, పసుపుగా..ఎన్నో వర్ణాలతో హరివిల్లులా విరబూస్తుంది. పండ్లు మాటలేమో కానీ, ఆ ఆకులు , చెట్టును చూడ్డానికే జనాలు ఎగబడుతున్నారట.
ఏఏ పండ్ల జాతులు కావాలో సెలక్ట్ చేసుకొని...వాటిని జాగ్రత్తగా అంటుకట్టాడట ప్రొఫిసర్ అకెన్. అంటు కట్టడంలో తేడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కానీ.. నాలుగేళ్లకు ఈ పండ్లు కాయలేదట.
అంటుకట్టడానికి ఫుల్ కేర్ తీసుకోవాలి. ముందు అట్టుకట్టే ప్లేస్, మరో మొక్కతో యాడ్ చేసి ఆ ప్లేస్ ను పోలథిన్ కవర్ తో క్లోజ్ చేస్తారు. మిస్ అయ్యి...గాలి చొరబడిందా...ఇక అంతే చెట్టు కాదు కదా ఆకు కూడా బతకదు. సో చాలా కేర్ ఫుల్ గా పని కంప్లీట్ చెయ్యాలి.
ఈ చెట్టు అంటుకట్టుకోవడానికి, పండ్లు కాయడానికి మొత్తం నాలుగేళ్లు పట్టిందట. హైబ్రీడ్ అయినా పర్ఫెక్ట్ టేస్ట్ ఉన్నాయట ఈ ఫ్రూట్స్. ఎలాంటి కెమికల్స్ లేకుండా కాస్తున్న పండ్లు కావటంతో జనాలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.ఇంకొంత మందైతే ఇళ్లలోనే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారట.అయితే అందరికి కుదరట్లేదట. ఈ చెట్టు ఇంకొంచెం హెల్దీ గా తయారయితే ఇలాంటి వాటిని చాలా చేస్తామంటున్నారు ప్రొఫిసర్ అకెన్.