హైడ్రా ద్వారా కాంగ్రెస్ నాయకులకు చెందిన అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. జలయశయాలను రక్షించేందుకే హైడ్రా కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు BRS ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి హైడ్రా ద్వారా తమ నిర్మాణాలను తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
హైడ్రా ద్వారా కాంగ్రెస్ నాయకులకు చెందిన అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. హైడ్రా కూలిచివేతలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా కూల్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఆయన గుర్తుచేశారు. జీహెచ్ఏంసీ ప్రధాన కార్యాలయం వద్ద నీటి కుంట ఉండేది దాన్ని కూల్చేస్తారా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన CCMB ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉందని ఆయన గుర్తుచేశారు. దాన్ని కూడా కూల్చేస్తారా అని ఓవైసీ ప్రశ్నించారు.