Prabhas: రెబల్ స్టార్ తో పాకిస్తానీ బ్యూటీ.. ఫ్యాన్స్ కి పండుగే.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదలై  పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందారు.  అలాంటి ప్రభాస్ తో నటించాలంటే ఎవరికైనా అదృష్టం కావాలి. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి మూవీ అద్భుతమైనటువంటి హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు.  ఇప్పటికే హను రాఘవపూడి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో  ఒక చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలు ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721636878_sajal.jpg

న్యూస్ లైన్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదలై  పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందారు.  అలాంటి ప్రభాస్ తో నటించాలంటే ఎవరికైనా అదృష్టం కావాలి. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి మూవీ అద్భుతమైనటువంటి హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు.  

ఇప్పటికే హను రాఘవపూడి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో  ఒక చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలు ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ తో  రాబోతున్న ఈ మూవీ పీడియాట్రిక్ డ్రామాగా  వస్తుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీలో సైనికుడిగా కనిపించబోతున్నారట.

అయితే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ కూడా  పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి  తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటయ్యా అంటే  ప్రభాస్ సరసన కథానాయకగా పాకిస్తానీ నటి చేయబోతుందట. దీనికోసం డైరెక్టర్ హను రాఘవపూడి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. శ్రీదేవి నటించిన మామ్ సినిమాలో నటించిన సజల్ అలీ ఇండియాలో మంచి గుర్తింపు పొందింది.

అయితే ఈ మూవీ తర్వాత సాజల్ కి బాలీవుడ్ లో అంతగా అవకాశాలు ఏమీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్ తో యువతను ఫిదా చేస్తూ వస్తోంది.  అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన అద్భుతంగా ఉంటుందని, వీరి మధ్య రొమాన్స్ తట్టుకోలేమని ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వాలని అభిమానులు కామెంట్లు కూడా చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu hanu-raghavapudi mom-movie sajal-ali pakisthan-heroine

Related Articles