Gandhi Hospital: గాంధీ ఆస్ప‌త్రిలో లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి

జూనియర్ డాక్టర్ ను ఆప్రాన్  లాగి ఇబ్బందిపెట్టాడు. వెంటనే ఆమె అరవడంతో...చుట్టు ప్రక్కల వారు అలర్ట్ అయ్యారు. ఆ వ్యక్తిని రెండు దెబ్బలు వేసి ..తన నుంచి లేడీ డాక్టర్ ఇబ్బంది పడకుండా చూసుకున్నారు


Published Sep 12, 2024 07:50:00 AM
postImages/2024-09-12/1726107719_doctor.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సికింద్రాబాద్‌ గాంధీ హాస్పటిల్ లో జూనియర్‌ డాక్టర్‌పై దాడి అందరిని షాక్ కు గురి చేసింది . ఎమ‌ర్జెన్సీ వార్డులో ఓ లేడీ డాక్టర్‌పై రోగి బంధువు దాడికి పాల్పడ్డాడు. అటుగా వెళ్తున్న జూనియర్ డాక్టర్ ను ఆప్రాన్  లాగి ఇబ్బందిపెట్టాడు. వెంటనే ఆమె అరవడంతో...చుట్టు ప్రక్కల వారు అలర్ట్ అయ్యారు. ఆ వ్యక్తిని రెండు దెబ్బలు వేసి ..తన నుంచి లేడీ డాక్టర్ ఇబ్బంది పడకుండా చూసుకున్నారు.


స‌మాచారం అందుకున్న పోలీసులు గాంధీ ఆస్ప‌త్రికి చేరుకుని, దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌డిని చిల‌క‌ల‌గూడ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా జూడాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


అంతేకాదు ..ఎవ్వరు లేని టైంలో దాడులు చేస్తే ఏం చెయ్యాలని తమకు సెక్యూరిటీ కంపల్సరీ ఉండాలని కోరారు. పోలీస్ ప్రొటక్షన్ తో పాటు దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు.
 

newsline-whatsapp-channel
Tags : attack gandhi-hospital junior-doctor

Related Articles