ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వనమహోత్సవ కార్యక్రమంపై తాజాగా వీడియో సందేశం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొక్కలను పెంచాలని, మొక్కల
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వనమహోత్సవ కార్యక్రమంపై తాజాగా వీడియో సందేశం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొక్కలను పెంచాలని, మొక్కల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలవాలని ఆయన కోరుకున్నారు. ప్రతి చెట్టు ప్రగతికి మెట్టని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అన్యజాతి మొక్కలను పెంచడం మానేసి దేశవాళి మొక్కలను పెంచడం మంచిదని, ఆయన అన్నారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వారి సొంత పనిగా తీసుకొని సక్సెస్ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక వీడియో సందేశం ద్వారా బయటపెట్టారు. ఆగస్టు 30 నుంచి మొదలయ్యే ఈ వేడుకను గల్లి నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు అట్టహాసంగా నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడే విధంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. మొక్కలు నాటడం కాదు దాన్ని తప్పకుండా సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని, రాష్ట్రంలో 50 శాతానికి పైగా పచ్చదనం పెరగాలని తెలియజేశారు.
https://www.instagram.com/p/C_R1eLKPio1/?igsh=MXd3OXhmYXpwcW03dw==
ఈ మొక్కల పెంపకంలో కూడా జాతులు చాలా కీలకమని, ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా దేశీయ జాతులను ఎంపిక చేసుకోవాలని స్థానిక వృక్షజాతులకు చెందిన మొక్కలు నాటడం ద్వారా జీవవైవిద్యం, నేల ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని, మనమంతా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని తెలియజేశారు. దేశ భౌగోళిక పరిస్థితులు దెబ్బతినే మొక్కలు నాటవద్దని, కొంతమంది వేగంగా పెరుగుతాయని ఎవెన్యూ ప్లాంటేషన్ అని నిర్వహణ ఖర్చులు తక్కువ అని కోనో కార్పస్, 7 ఆకుల పాల, మడగాస్కర్ అల్మాన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి మొక్కలను నాటుతున్నారని వీటివల్ల పర్యావరణానికి కీడు తప్ప మేలు ఉండదని తెలియజేశారు.
ఆరాబ్ వంటి ఎడారి దేశాలే కొనో కార్పస్ జాతి మొక్కలను పెంచవద్దని తెలిపాయి, మనం అలాంటి మొక్కలను ఎందుకు పెంచాలని వీడియో సందేశం ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేవలం ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, సినీ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు అందరూ ఒక బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచాలని కోరారు.