Jr. NTR: Jr.ఎన్టీఆర్ కి అన్యాయం చేసిన పవన్.. ఫ్యాన్స్ ఫైర్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ కి అన్యాయం జరిగిందా.. అదెలా.. అసలు ఎన్టీఆర్ కి పవన్ ఎందుకు అన్యాయం చేస్తారు..ఇంతకీ ఇందులో ఉన్న మతలబ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో 


Published Sep 27, 2024 05:20:00 PM
postImages/2024-09-27/1727435476_ntrpawandevara.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ కి అన్యాయం జరిగిందా.. అదెలా.. అసలు ఎన్టీఆర్ కి పవన్ ఎందుకు అన్యాయం చేస్తారు..ఇంతకీ ఇందులో ఉన్న మతలబ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దేవర సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సింది.

కానీ కొన్ని కొన్ని చోట్ల  ఈ సినిమాకి ఎదురు దెబ్బ తగులుతోందట. ముఖ్యంగా తమిళనాడులో దేవరను ఎవరూ ఆదరించడం లేదని తెలుస్తోంది.ఇక దానికి ముఖ్య కారణం కూడా పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి .మరి పవన్ కళ్యాణ్ ఎలా కారణమయ్యారంటే.. రీసెంట్గా తిరుమల లడ్డు వివాదం జరుగుతున్న సమయంలో కార్తీ తన సత్యం సుందరం సినిమా ఈవెంట్లో లడ్డు గురించి స్పందించమంటే..లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేను అంటూ స్పందించారు.

కానీ దీనిపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగి కార్తీ పై ఫైర్ అయ్యారు.దీంతో దిగొచ్చిన కార్తీ సారీ చెప్పారు. కానీ కార్తీ చేసిన తప్పేమీ లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ కావాలనే సారీ చెప్పించుకున్నారని తమిళ అభిమానులు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే తాజాగా విడుదలైన దేవర సినిమాపై పవన్ కళ్యాణ్ ప్రభావం పడిందని తెలుస్తోంది.

ఎందుకంటే పవన్ పై తమిళ అభిమానులు కోపంగా ఉన్న వేళ దేవర పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడంతో  తెలుగు సినిమా కావడంతో తమిళనాడు సినీ ప్రియులు దీన్ని ఆదరించలేదు. అలా పవన్ కారణంగా దేవరకి తమిళనాడులో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి అని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.అలా పరోక్షంగా ఎన్టీఆర్ కి పవన్ అన్యాయం చేశారు అని పోస్టులు పెడుతూ పవన్ పై ఫైర్ అవుతున్నారుఎన్టీఆర్ అభిమానులు.

newsline-whatsapp-channel
Tags : news-line pawan-kalyan jr-ntr kollywood devara hero-karthi tirumala-laddu

Related Articles